Uttar Pradesh: యూపీలో విషాదం.. చాక్లెట్లు తిని నలుగురు చిన్నారులు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్ జిల్లాలో బుధవారం విషాద సంఘటన చోటుచేసుకుంది. చాక్లెట్లు తిని నలుగురు చిన్నారులు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. కాశ్య ప్రాంతంలోని దిలీప్ నగర్‌లో ఉన్న ఓ ఇంటి ముందు ప్లాస్టిక్ బ్యాగ్ దొరికింది. ఓ మహిళ ఆ బ్యాగ్‌ను తెరిచి చూడగా అందులో ఐదు చాక్లెట్లు, కొన్ని నాణేలు ఉన్నాయి. అయితే ఆ చాక్లెట్లను ఆమె తన ముగ్గురు మనవళ్లకు, పక్కింట్లో నివసిస్తున్న మరో చిన్నారికి ఇచ్చింది. ఆ చాక్లెట్లు తిన్న కాసేపటికే పిల్లలు స్పృహ కోల్పోయారు.
దీంతో తల్లిదండ్రులు చిన్నారులను వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే వాళ్లు చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతులను మంజన (3), స్వీటీ (3), సమర్ (2), అరుణ్ (5)గా గుర్తించారు. వీరిలో మంజన, స్వీటీ, సమర్ తోబుట్టువులుగా పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పిల్లలు తిన్న చాక్లెట్‌ను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపినట్లు ఖుషీనగర్ జిల్లా కలెక్టర్ తెలిపారు. కాగా చాక్లెట్ తిని నలుగురు చిన్నారులు మృతి చెందడంతో సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయాన్ని అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని అధికారులకు సూచించారు.
Also Read
- Tamil Nadu: అన్నాడీఎంకేకు బిగ్ షాక్.. ముగ్గురు ఎమ్మెల్యేలు టీవీకేలో చేరిక
- Howrah Police: నేరస్థుల గుండెల్లో సువేందు సర్కార్ రైళ్లు.. పేరుమోసిన నేరస్థుడిని లోదుస్తుల్లో తీసుకెళ్లిన హౌరా పోలీసులు
- Fee Refund: నీట్ యూజీ పరీక్ష ఫీజు రిఫండ్.. దరఖాస్తుకు రెండు రోజులే సమయం..
- Supreme Court: అంత భావోద్వేగంగా తీసుకోవద్దు.. కాక్రోచ్ జనతా పార్టీ పిటిషన్లపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
Uttar Pradesh | We got info that 4 children died after the consumption of toffees which were placed outside their house by someone. Prima facie it's appearing that the toffees were poisonous. Food safety & Forensic team are investigating the matter: Sachindra Patel, SP Kushinagar pic.twitter.com/FI8vz8vWDB
— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 23, 2022
తాజావార్తలు
-
Tamil Nadu: అన్నాడీఎంకేకు బిగ్ షాక్.. ముగ్గురు ఎమ్మెల్యేలు టీవీకేలో చేరిక
-
Ram Charan : రామ్ చరణ్ తన బాడీగార్డ్‌కు రోజుకు ఎంత ఇస్తున్నాడో తెలుసా ?
-
Venkatesh Iyer: సడన్‌గా వెంకటేశ్ అయ్యర్‌కు హైప్.. తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో కోహ్లీతో ఓపెనర్‌గా రంగంలోకి..
-
Sesha 2016: కిల్లర్ స్కెచ్‌తో వణికిపోయే పోలీసులు… రాత్రంతా నరకయాతన.. ఓటీటీలో వణుకు పుట్టిస్తున్న థ్రిల్లర్ మూవీ
-
Team India: జూన్‌లో టీమ్ ఇండియా బిజీ బిజీ.. టెస్టులు, టీ20లు, వన్డేలతో సహా ఆరు అంతర్జాతీయ మ్యాచ్‌లు!
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?