Mandi: కార్యకర్తలకు బీజేపీ నేత జైరామ్ ఠాకూర్ సమోసా పార్టీ
- హిమాచల్‌ప్రదేశ్ రాజకీయాలను సమోసా వివాదం
- కార్యకర్తలకు బీజేపీ నేత జైరామ్ ఠాకూర్ సమోసా పార్టీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిమాచల్‌ప్రదేశ్ రాజకీయాలను సమోసా వివాదం కుదిపేస్తోంది. అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య ఈ వ్యవహారం రచ్చరచ్చ చేస్తోంది. ఇప్పటికే నేతలు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. సమోసాల మిస్సింగ్‌పై అధికార కాంగ్రెస్ పార్టీ సీఐడీ విచారణకు ఆదేశించడం పెను దుమారం చెలరేగింది. దీనిపై ప్రతిపక్ష బీజేపీ తీవ్ర విమర్శనాస్త్రాలు సంధించింది. తాజాగా సమోసా వివాదం నేపథ్యంలో మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత జైరామ్ ఠాకూర్ సమోసా పార్టీ ఇచ్చారు. మండిలోని సర్క్యూట్ హౌస్‌లో బీజేపీ కార్యకర్తలతో కలిసి సమోసా పార్టీ ఆస్వాధించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అసలేం జరిగిందంటే..
అక్టోబర్ 21న ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు సీఐడీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ జరిగిన ఓ కార్యక్రమం కోసం ప్రముఖ హోటల్ నుంచి సమోసాలు తెప్పించారని, అయితే వాటిని సెక్యూరిటీ సిబ్బంది తినేసినట్లుగా వార్తలు హల్‌చల్ చేశాయి. సీఎం దగ్గరకు చేరాల్సిన సమోసాలు, కేక్‌లు మధ్యలో ఎలా దారి తప్పాయో గుర్తించేందుకు సీఐడీ విచారణకు సీఎం ఆదేశించినట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి. దీంతో ప్రతిపక్ష బీజేపీ నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యవహారం హాస్యాస్పదంగా ఉందంటూ ఎద్దేవా చేసింది. వాటిని ఇతరులు తింటే ఏమవుతుందని ప్రశ్నించింది. సీఎం తినాల్సిన సమోసాలను తీసుకెళ్లిందెవరు..? సీఐడీ తేల్చనుంది..?’’ అని బీజేపీ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఈ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతుండటంతో సీఎం సుఖు క్లారిటీ ఇచ్చారు.
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
- LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
- Rahul Gandhi's SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
అసలు ఇలాంటిది ఏమీ జరగలేదని తేల్చారు. సమోసాల వ్యవహారంపై సీఐడీ విచారణ జరుపుతున్నట్లుగా వస్తున్న వార్తలను కొట్టిపారేశారు. సీఐడీ విచారణ చేస్తున్న అంశం వేరు అని చెప్పారు. మీడియాలో మాత్రం సమోసాలపై సీఐడీ విచారణ అంటూ ప్రచారం చేస్తున్నారని సుఖు మండిపడ్డారు.
ఇదే వ్యవహారంపై సీఐడీ అధికారులు కూడా స్పందించింది. ఇదంతా సీఐడీ అంతర్గత వ్యవహారం అని తేల్చారు. దీనిని రాజకీయం చేయొద్దని కోరింది. ముఖ్యమంత్రి సమోసాలు తినరని.. తాము ఎవరికీ నోటీసులు ఇవ్వలేదని… అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకే విచారణకు ఆదేశించినట్లు తెలిపింది. ఈ విషయంతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని సీఐడీ పేర్కొంది. అయినా ఈ సమాచారం ఎలా లీక్ అయిందో కూడా తెలుసుకుంటామని సీఐడీ డీజీ సంజీవ్ రంజన్ స్పష్టం చేశారు.
#WATCH | Mandi: Amid the 'samosa' controversy, Former Himachal Pradesh CM and LoP Jairam Thakur organises a samosa party with BJP workers at the Circuit House in Mandi.
(Source: Jairam Thakur Office) pic.twitter.com/wq1rrm57X0
— ANI (@ANI) November 8, 2024
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?