Footover bridge at Chandrapur railway station in Maharashtra collapses, over 20 injured: గుజరాత్ లో మోర్చి వంతెన కూలిన ఘటన యావత్ భారతాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. 140 మందికి పైగా మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మరవక ముందే మరో ఘటన జరిగింది. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో ఓ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కుప్పకూలింది. చంద్రపూర్ /జిల్లాలోని బల్హార్షా రైల్వే స్టేషన్ లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఆదివారం కూలిపోయింది. ఈ ఘటనలో 20 మంది గాయపడ్డారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also: China: డర్టీ డ్రాగన్ ఇక మారదు… కీలక సమావేశానికి ఇండియాను పిలవని చైనా
దాదాపుగా 60 అడుగుల ఎత్తులో ఉన్న బ్రిడ్జ్ కూలిపోవడంతో ప్రయాణికులు రైల్వే ట్రాకుపై పడిపోయారు. పుట్ ఓవర్ బ్రిడ్జ్ లోని కొంత భాగం కూలిపోవడంతో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో 8 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్లాట్‌ఫారమ్ నంబర్ 1 నుండి ప్లాట్‌ఫారమ్ నంబర్ 4కి ప్రయాణికులు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. కాజీపేట-పూణే ఎక్స్ ప్రెస్ అందుకోవడానికి ప్రయాణికులు వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. గాయపడిని వారిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. న్యూఢిల్లీ-చెన్నై మార్గంలో ప్రధాన రైల్వే స్టేషన్ గా ఉంది బల్హార్షా.
#WATCH | Slabs fall off of a foot over bridge at Balharshah railway junction in Maharashtra's Chandrapur; people feared injured pic.twitter.com/5VT8ry3ybe
— ANI (@ANI) November 27, 2022