Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News First Phase Of Census With Houselisting Operations To Begin From April 1 2026

Census: ఏప్రిల్1, 2026 నుంచి ప్రారంభం కానున్న జనాభా గణన.. ముందుగా ఇళ్ల లెక్కింపుతో షురూ..

Published Date :June 29, 2025 , 5:29 pm
By Venu Goapl Reddy
  • ఏప్రిల్ 1, 2026 నుంచి జనాభా లెక్కలు ప్రారంభం..
  • ముందుగా దేశవ్యాప్తంగా ఇళ్ల గణనతో స్టార్ట్..
  • రెండో దశలో జనాభా వివరాల సేకరణ..
Census: ఏప్రిల్1, 2026 నుంచి ప్రారంభం కానున్న జనాభా గణన.. ముందుగా ఇళ్ల లెక్కింపుతో షురూ..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Census: దేశవ్యాప్తంగా ‘‘జనాభా లెక్కింపు’’పై కేంద్రం చర్యల్ని వేగవంతం చేసింది. తొలి దశలో దేశవ్యాప్తంగా ఉన్న ఇళ్లను లెక్కించి, జాబితా చేయనున్నారు. ఈ గృహాల గణన ఏప్రిల్ 1, 2026 నుంచి ప్రారంభమవుతుందని, ఇది జనాభా లెక్కింపు మొదటి దశ ప్రారంభాన్ని సూచిస్తుందని భారత రిజిస్ట్రార్ జనరల్ తెలిపారు.

ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు జనాభా లెక్కల కమిషనర్, రిజిస్ట్రార్ జనరల్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ లేఖ రాశారు. దీంట్లో గృహాల జాబితా కార్యకలాపాలు, గృహాల గణన ఏప్రిల్ 1, 2026 నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. దీనికి ముందు పర్యవేక్షకులు, ఎన్యూమిరేటర్స్ నియామకం జరగనుంది. రాష్ట్రాలు, జిల్లా పరిపాలన సహకారంతో వీరికి పని విభజన జరుగుతుందని లేఖలో పేర్కొన్నారు.

Read Also: Minister Nara Lokesh: “ఇంటింటికీ టీడీపీ”.. ప్రజాప్రతినిధులకు నారా లోకేష్ కీలక ఆదేశాలు..

జనాభా లెక్కింపు రెండు దశలుగా జరగనుంది. మొదటి దశలో గృహాల జాబితా ఆపరేషన్(HLO), ప్రతీ ఇంటి పరిస్థితులు, ఆస్తులు, సౌకర్యాల వంటి వివరాలను సేకరిస్తారు. తర్వాత రెండో దశలో ప్రతి ఇంటిలోని ప్రతి వ్యక్తి యొక్క జనాభా, సామాజిక-ఆర్థిక, సాంస్కృతిక మరియు ఇతర వివరాలను సేకరించనున్నారు, ఇది ఫిబ్రవరి 1, 2027న జరగాల్సి ఉందని లేఖలో పేర్కొన్నారు. జనాభా గణనలో, కుల గణన కూడా జరుగుతుందని ప్రభుత్వ ప్రకటన తెలిపింది.

జనాభా గణన కార్యకలాపాల కోసం, 34 లక్షలకు పైగా గణనదారులు మరియు పర్యవేక్షకులు మరియు సుమారు 1.3 లక్షల జనాభా గణన కార్యకర్తలను నియమించనున్నారు. ఇది 16వ జనాభా గణన అవుతుంది. స్వాతంత్య్రం తర్వాత ఇది 8వది. రాబోయే జనాభా గణనను మొబైల్ అప్లికేషన్‌లను ఉపయోగించి డిజిటల్ మార్గాల ద్వారా నిర్వహిస్తారు. స్వీయ గణనను కూడా ప్రజలకు అందుబాటులో ఉంచుతారు.

రిజిస్ట్రార్ జనరల్, జనాభా గణన కమిషనర్ కార్యాలయం ప్రజలను అడగడానికి దాదాపు 3 డజన్ల ప్రశ్నల్ని సిద్ధం చేసింది. ఈ సర్వేలో గృహాలను ఫోన్లు, ఇంటర్నెట్, వాహనాలు (సైకిల్, స్కూటర్, మోటార్ సైకిల్, కారు, జీప్, వ్యాన్), ఉపకరణాలు (రేడియో, టీవీ, ట్రాన్సిస్టర్) వంటి వాటి గురించి అడుగుతారు. తాగు నీరు, లైటింగ్, మరుగుదొడ్లు, మురుగునీటి సౌకర్యాలు, వంటగది, ఎల్పీజీ కనెక్షన్ గురించి అడుగుతారు. ఇంటి ఫ్లోర్, పైకప్పుకు ఉపయోగించిన పదార్థాలు, దాని పరిస్థితి, నివాసితుల సంఖ్య, గదుల సంఖ్య, వివాహ స్థితి, ఇంటి యజమాని స్త్రీ నా లేదా ఎస్సీ, ఎస్టీకి చెందిన వారా..? అనే అదనపు ప్రశ్నలు ఉంటాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Caste Census
  • Caste Enumeration
  • Census
  • Census 2026
  • Census With Houselisting Operations

తాజావార్తలు

  • Off The Record : శైలజానాథ్ రాకతో టికెట్ కథ మళ్లీ మొదటికొచ్చిందా? లెక్కలు మారితే మళ్లీ చిక్కులేనని టెన్షన్

  • OTR: జనసేన నేత ఇల్లు కూల్చివేతతో రాజకీయ ప్రకంపనలు.. పేర్ని నాని ఎంట్రీతో కూటమిలో రచ్చ!

  • Central Govt: మీకు ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసా..? అయితే రూ.10 వేలు మీకే..

  • OTR: ఓల్డేజ్ హోంగా బీఆర్ఎస్.. అప్పుడే గులాబీ తోటలో ప్రకంపనలు!

  • Madhapur job scam : సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పేరిట భారీ మోసం..రూ.5 కోట్లు బురిడీ..

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions