Op Sindoor 2.0: పాకిస్తాన్లో భయం భయం.. సరిహద్దులకు యాంటీ డ్రోన్ సిస్టమ్స్..
- పాకిస్తాన్‌ను వెంటాడుతున్న ‘‘ఆపరేషన్ సిందూర్’’ భయం..
- భారత సరిహద్దుల్లో యాంటీ-డ్రోన్ సిస్టమ్స్ మోహరింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Op Sindoor 2.0: పాకిస్తాన్‌ను ‘‘ ఆపరేషన్ సిందూర్ ’’ దాడులు భయపెడుతూనే ఉన్నాయి. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ తీవ్రస్థాయిలో దాయాదిపై విరుచుకుపడింది. ఆనాటి దాడులు ఇప్పటికీ కూడా పాకిస్తాన్ భయపడేలా చేస్తున్నాయి. తాజాగా, ఆపరేషన్ సిందూర్ 2.0 దాడులు జరుగుతాయనే భయంతో పాకిస్తాన్ భారత సరిహద్దుల్లో నియంత్రణ రేఖ(LOC) వెంబడి ఆయుధాలను మోహరిస్తోంది. ఎల్ఓసీ, పాక్ ఆక్రమితక కాశ్మీర్(పీఓకే) ప్రాంతాల్లో కౌంటర్ డ్రోన్ మోహరింపుల్ని గణనీయంగా పెంచింది. కౌంటర్ అన్ మ్యాన్డ్ ఎరియల్ సిస్టమ్స్(C-UAS)ను సరిహద్దుల్లోని రావాల్కోట్, కోట్లి, భీంబర్ సెక్టార్లలో మోహరించింది. ఎల్ఓసీ వెంబడి 30కి పైగా ప్రత్యేక యాంటీ డ్రోన్ యూనిట్లను మోహరించింది.
Read Also: Transfers : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. భారీగా మున్సిపల్ కమిషనర్ల బదిలీ
Also Read
- Supreme Court: సీజేపీకి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ.. ఉద్యమంపై ప్రధాన న్యాయమూర్తి సంచలన వాఖ్యలు..
- CJP Protest: ఉద్యమం ఆగదు.. 4 ప్రధాన డిమాండ్లను ప్రకటించిన సీజేపీ!
- Maruti Suzuki: బిగ్ అలర్ట్.. కారు కొనాలనుకుంటే ఇప్పుడే కొనేయండి.. భారీగా పెరగనున్న ధరలు..
- Preity Zinta Support Student Protests: విద్యార్థుల ఉద్యమానికి మద్దతు.. ప్రీతి జింటా చేసిన వ్యాఖ్యలు వైరల్
ఈ మోహరింపులు ముర్రీలోని ప్రధాన కార్యాలయం ఉన్న 12వ ఇన్ఫెంట్రీ డివిజన్‌తో పాటు, కోట్లి–భింబర్ వెంట బ్రిగేడ్లను నియంత్రించే 23వ ఇన్ఫెంట్రీ డివిజన్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఎల్ఓసీనికి దగ్గరగా వైమానిక నిఘా, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ను బలోపేతం చేయడానికి ఈ చర్యల్ని పాకిస్తాన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. సెక్టార్ల వారీగా చూస్తే, రావల్కోట్లోని యాంటీ డ్రోన్ అసెట్స్‌ను ప్రధానంగా 2వ ఆజాద్ కాశ్మీర్ బ్రిగేడ్ నిర్వహిస్తుంది. ఇది భారత్‌లోని పూంచ్ సెక్టార్ కు ఎదురుగా ఉంటుంది. కోట్లీలో మోహరించి భారత్ లోని రాజౌరి, పూంచ్, నౌషేరా, సుందర్బానీ సెక్టార్లకు ఎదురుగా ఉంటుంది.
ఈ “సాఫ్ట్-కిల్” చర్యలతో పాటు, తక్కువ ఎత్తులో ఎగిరే డ్రోన్లను ఎదుర్కొనేందుకు పాకిస్తాన్ సంప్రదాయ గగనతల రక్షణ ఆయుధాలను కూడా మోహరించింది. వీటిలో రాడార్ గైడెడ్ వ్యవస్థల సపోర్ట్ కలిగిన ఓర్లికాన్ GDF 35 మిమీ ట్విన్-బారెల్ యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ గన్స్, అలాగే నెమ్మదిగా, తక్కువ ఎత్తులో ఎగిరే లక్ష్యాలను ఛేదించగల అంజా Mk-II, Mk-III మాన్-పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ (MANPADS) ఉన్నాయి. ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్తాన్ గగనతలం ఎంత వీక్‌గా ఉందనే విషయాన్ని ఆ దేశం గుర్తించింది. దీంతో ఈ లోపాలను పూడ్చేందుకు కొత్త డ్రోన్లు, వైమానిక రక్షణ వ్యవస్థల్ని సేకరించేందుకు పాకిస్తాన్ టర్కీ, చైనాలతో చర్చలు జరుపుతోందని సమాచారం.
తాజావార్తలు
-
Supreme Court: సీజేపీకి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ.. ఉద్యమంపై ప్రధాన న్యాయమూర్తి సంచలన వాఖ్యలు..
-
Hyderabad: ACBకి చిక్కిన మరో అవినీతి అధికారి.. భారీ మొత్తంలో ఆస్తులు గుర్తింపు.!
-
David Warner: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిన స్టార్ క్రికెటర్.. నేరం అంగీకారం.. శిక్షపై ఉత్కంఠ..!
-
CJP Protest: ఉద్యమం ఆగదు.. 4 ప్రధాన డిమాండ్లను ప్రకటించిన సీజేపీ!
-
Karimnagar: అర్ధరాత్రి దొంగల బీభత్సం.. కత్తులు, తుపాకులతో బెదిరించి.. రూ. 50 లక్షలు అపహరణ.!
ట్రెండింగ్
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్‌టాప్‌లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!