Pune Bridge Collapses: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. పూణేకి సమీపంలోని ఇంద్రాయణి నదిపై ఉన్న వంతెన కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించగా, మరో 25మంది పర్యాటకులు గల్లంతయ్యారని తెలుస్తోంది. వర్షాకాలం రద్దీగా ఉండే ప్రసిద్ధి పర్యాటక కేంద్రమైన కుండ్మలలో ఆదివారం ఈ దుర్ఘటన జరిగింది.