JEE: మారుమూల గ్రామం, రైతు కుటుంబ నేపథ్యం.. జేఈఈ మెయిన్స్‌లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JEE: సాధారణ కుటుంబాలు, పేదరిక నేపథ్యం కలిగిన వ్యక్తులు దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్నారు. ఇటీవల విడుదలైన సివిల్స్ ఫలితాల్లో ఇలాంటి వారు అనేక మంది ర్యాంకులు సాధించారు. తాజాగా విడుదలైన జేఈఈ మెయిన్స్‌లో కూడా ఇలాంటి నేపథ్యం ఉన్న బిడ్డలు మెరిశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన జేఈఈ మెయిన్స్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. మహారాష్ట్ర వాషిం జిల్లాలో మారుమూల గ్రామానికి చెందిన సాధారణ రైతు బిడ్డ నీలకృష్ణ గజారే జేఈఈ మెయిన్స్‌లో ఆల్ ఇండియా 1వ ర్యాంక్ సాధించారు.
READ ALSO: Pithapuram: బాబాయ్ కోసం అబ్బాయ్.. పిఠాపురంలో మెగా హీరో ప్రచారం!
Also Read
- Gyanesh Kumar: ప్రతిపక్షాల విమర్శల మధ్య CEC జ్ఞానేష్ కుమార్.. ఆయన ఎవరు, నేపథ్యం ఏమిటి?
- Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
- Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
- B.Tech Degree: ఇక నుంచి బీటెక్ 5 సంవత్సరాలు.. ప్రతిపాదించిన ఢిల్లీ ఐఐటీ మాజీ డైరెక్టర్..
గత రెండేళ్లుగా పట్టుదల, కృషి ఈ ర్యాంక్ సాధించేలా చేసిందని అతను చెప్పాడు. వాషిం జిల్లాలో మారుమూల గ్రామం బెల్ఖేడ్కి చెందిన నీల్‌కృష్ణ పరీక్ష కోసం ప్రతీరోజు 10 గంటల కన్నా ఎక్కువ సమయం కేటాయించాడు. నీల్‌కృష్ణ తండ్రి నిర్మల్ గజరే మీడియాతో మాట్లాడుతూ.. తన కుమారుడి విజయం పట్ల సంతోషం వ్యక్తం చేయడానికి మాటలు రావడం లేదని అన్నారు. నీల్‌కృష్ణ తన ప్రాథమిక విద్యను అకోలాలోని రాజేశ్వర్ కాన్వెంట్, వాషిమ్‌లోని కరంజా లాడ్లోని జెసి హైస్కూల్లో చదివాడు. ఆ సమయంతో తన అత్త ఇంట్లో ఉండీ విద్యాభ్యాసం కొనసాగించాడు.
నీల్ కృష్ణ అద్భుతమైన విద్యార్థి అని, క్రీడల్లో నిష్ణాతుడని, ఆర్చరీలో జిల్లా, జాతీయ స్థాయి టోర్నీల్లో పాల్గొన్నడాని అతని తండ్రి నిర్మల్ తెలిపారు. ఉదయం 4 గంటలకు లేచి రెండు గంటలు చదువుకుని, మళ్లీ ఉదయం 8.30 గంటల నుంచి చదవడం ప్రారంభించి రాత్రి 10 గంటలకు నిద్ర పోయేవాడని నిర్మల్ వెల్లడించారు. తాను ఎప్పటికీ సాధించలేని వాటిని తన కొడుకు సాధించాలని కోరుకున్నట్లు చెప్పారు. నీల్‌కృష్ణ ఐఐటీ బాంబేలో చదువుకోవాలని, సైంటిస్ట్‌గా ఎదిగేందుకు కృషి చేస్తానన్నారు. వచ్చే నెలలో నిర్వహించనున్న JEE-అడ్వాన్స్‌డ్‌కు సిద్ధమవుతున్నాడు.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!