Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • Pahalgam Terror Attack
  • Story Board
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Farmers Protest On June 9 In Support Of Constable Who Slapped Kangana Ranaut

Kangana Ranaut: కంగనాని చెంపదెబ్బ కొట్టిన కానిస్టేబుల్‌కి మద్దతుగా రైతుల సంఘాల నిరసన..

NTV Telugu Twitter
Published Date :June 7, 2024 , 4:59 pm
By venugopal reddy
Kangana Ranaut: కంగనాని చెంపదెబ్బ కొట్టిన కానిస్టేబుల్‌కి మద్దతుగా రైతుల సంఘాల నిరసన..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Kangana Ranaut: మండి ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ గురువారం చండీగఢ్ ఎయిర్‌పోర్టులో చెంపదెబ్బ కొట్టడం సంచలనంగా మారింది. ఈ విషయంలో ఇప్పటికే ఉన్నతాధికారులు ఆమెను సస్పెండ్ చేయడంతో పాటు అరెస్ట్ చేశారు. రైతుల ఆందోళనపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే తాను దాడి చేశానని కుల్విందర్ కౌర్ చెప్పారు. రూ. 100 తీసుకుని రైతులు ఆందోళనల్లో పాల్గొంటున్నారని కంగనా వ్యాఖ్యలు చేసిన సమయంలో తన తల్లి కూడా ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనల్లో పాల్గొందని ఆమె అన్నారు.

Read Also: China: మోడీకి మెజారిటీ తగ్గడంపై చైనా ఫుల్ ఖుషీ.. ఎందుకు..?

మరోవైపు కంగనా ఓ వీడియో సందేశంలో మాట్లాడుతూ, తనపై దాడి జరిగిందని, తనను దుర్భాషలాడారని చెప్పింది. పంజాబ్‌లో పెరుగుతున్న తీవ్రవాదం, ఉగ్రవాదంపై ఆమె ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే, ఈ వ్యవహారం చిలికిచిలికి గాలివానలా మారేలా కనిపిస్తోంది. కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని డిమాండ్ చేస్తూ జూన్ 9న పంజాబ్ మొహాలీలో ఇన్సాఫ్ మార్చ్‌కి రైతు సంఘాలు ప్లాన్ చేస్తున్నాయి. విమానాశ్రయంలో ఈ ఘటనకు దారి తీసిన సంఘటనల క్రమంపై సరైన విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

ప్రముఖ రైతు సంఘాలైన సంయుక్త కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్) మరియు కిసాన్ మజ్దూర్ మోర్చా శుక్రవారం నాడు కుల్విందర్ కౌర్‌కు మద్దతు ప్రకటించాయి. SKM (నాన్ పొలిటికల్) నాయకుడు జగ్జిత్ సింగ్ దల్లేవాల్ మరియు కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ ప్రధాన కార్యదర్శి సర్వన్ సింగ్ పంధేర్ ఈ విషయంపై సరైన విచారణ కోసం పంజాబ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) గౌరవ్ యాదవ్‌ను కలవాలని యోచిస్తున్నారు. మహిళా కానిస్టేబుల్‌కి అన్యాయం జరగకూడదని కోరుతామని దల్లేవాల్ అన్నారు. కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్, కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ కార్యదర్శి షేర్ సింగ్ సోదరి. మరోవైపు సీఐఎస్ఎఫ్ కుల్విందర్ కౌర్‌ను సస్పెండ్ చేసి, ఈ ఘటనపై దర్యాప్తు చేయడానికి ప్యానెల్ ఏర్పాటు చేసింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Chandigarh Airport
  • Farmers Protest
  • Kangana Ranaut
  • Kulwinder Kaur

తాజావార్తలు

  • Rishabh Pant: పుండు మీద కారం చల్లడం అంటే ఇదే కాబోలు.. రిషబ్ పంత్‌కు భారీ జరిమానా.!

  • YS Jagan: వైఎస్‌ జగన్‌ సంచలన వ్యాఖ్యలు.. సత్తా అంటే కడపలో మహానాడు పెట్టడం కాదు..!

  • Chennai: ఎఐడిఎంకే ఎమ్మెల్యే కదంబూర్ రాజు సంచలన వ్యాఖ్యలు.. విజయ్ ఎన్డీఏ కూటమిలోకి వస్తారంటూ

  • Govt Hospital: ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ సతీమణి ప్రసవం.. హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు!

  • Naga Vamsi: టీడీపీకి 25 లక్షల విరాళం..

ట్రెండింగ్‌

  • Nissan Magnite CNG: నిస్సాన్ మాగ్నైట్‌కు ఇకపై సీఎన్జీ కిట్ కూడా.. కేవలం రూ.74,999 మాత్రమే..!

  • WhatsApp In iPad‌: ఆపిల్ ప్రియుల నిరీక్షణకు చెక్.. ఇకపై iPad‌లో కూడా వాట్సాప్..!

  • Motorola Razr 60: రూ. 49,999లకే రెండు డిస్‌ప్లేలు, 50MP కెమెరాతో మడతపెట్టే ఫోన్ను లాంచ్ చేసిన మోటరోలా..!

  • Jade Damarell: ‘ట్రూ లవ్’ అంటే ఇదేనేమో.. ప్రియుడు బ్రేకప్ చెప్పడంతో 10,000 అడుగుల ఎత్తు నుంచి దూకి సూసైడ్..!

  • Motorola Edge 2025: 50MP ఫ్రంట్ కెమెరా, Dimensity 7400 ప్రాసెసర్‌, హై ఎండ్ ఫీచర్లతో మోటరోలా ఎడ్జ్ 2025 లాంచ్‌..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions