Fake IPL : ఫేక్ ఐపీఎల్ ఆట.. కేటుగాళ్ల వసూళ్ల వేట..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాదేది కవితకనర్హం అని శ్రీశ్రీ అంటే.. కాదేది మోసానికి అనర్హమంటున్నారు కేటుగాళ్లు.. ఇప్పటికే డబ్బులు దండుకోవడానికి కొత్త కొత్తలను ఎంచుకుంటున్న మోసగాళ్లు.. ఇప్పుడు ఫేక్ ఐపీఎల్ లీగ్‌కు తెర తీశారు. అచ్చం నిజమైన ఐపీఎల్ మ్యాచ్‌ల మాదిరిగానే ఏకంగా ఐపీఎల్ టీంలనే తయారు చేశారు ఈ ఫేక్‌గాళ్లు. ఐపీఎల్ పేరిట నకిలీ మ్యాచ్‌లు నిర్వహిస్తూ ఆన్‌లైన్ బెట్టింగ్‌కు పాల్పడుతూ పందెంరాయుళ్ల నుంచి డబ్బులు దండిగా దండుకునే పనిపెట్టుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్‌లోని మెహ్సాన జిల్లా మోలిపూర్ గ్రామంలోని ఐపీఎల్ పేరిట ఫేక్ మ్యాచ్‌లను ఓ ముఠా నిర్వహిస్తోంది. అంతేకాకుండా.. ఆ మ్యాచ్‌లను యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. ఒరిజినల్ మ్యాచ్‌ల మాదిరిగా నిర్వహిస్తూ.. రష్యాకు చెందిన బెట్టింగ్ రాముళ్లకు వల వేశారు. అయితే..ఇంతకు ఈ ఫేక్ ఐపీఎల్ మ్యాచుల్లో ఆడుతున్న ఆటగాళ్లు ఎవరో కాదు.. వ్యవసాయ కూలీలు.. అవునూ.. వ్యవసాయ కూలీలకే రూ.400 కూలీ ఇచ్చి.. ప్రముఖ క్రికెటర్ల మాదిరిగా వారికి జెర్సీవేయించి గ్రౌండ్‌లోకి దించుతున్నారు.
Also Read
- West Bengal Govt: కోల్‌కతా తొక్కిసలాట ఘటన.. మృతుల కుటుంబసభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం.
- Kolkata Stampede: భారీ వర్షం.. పండాల్ కూలుతుందన్న ప్రకటన.. కోల్‌కతా తొక్కిసలాటపై పోలీసుల వివరణ..
- LPG Cylinder: పెరిగిన గ్యాస్ ఉత్పత్తి.. దసరాకు ముందు 14.2 కేజీల సిలిండర్ ధర ఎంత..?
- Diwali Bonus: భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఆ ఉద్యోగులకు రూ.13,816 దీపావళి బోనస్ ప్రకటన..
అంతేకాకుండా.. అంపైర్లుగా వ్యవహరించే వారి చేతిలో డమ్మి వాకీటాకీలు పెట్టి.. ఫేక్ ఐపీఎల్‌ను చిత్రీకరిస్తున్నారు. దీనికి తోడు.. ప్రముఖ కామెంటర్..హర్ష భోగ్లే స్వరాన్ని ఇమిటేట్ చేస్తూ కామెంటరీ చేయడం ఈ ఫేక్ ఐపీఎల్ మొత్తానికి ఫినిషింగ్ టచ్. ఇక్కడి ఇంకో విషయం ఎంటంటే.. ఈ ఫేక్ ఐపీఎల్ మ్యాచ్ చివరి దశ.. అంటే క్వార్టర్ ఫైనల్ చేరుకోవడం కొసమెరుపు. దీన్ని పసిగట్టిన పోలీసులు.. ఇప్పటికే నలుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. అయితే.. ఈ ముఠా లీడర్ షోయబ్ దవ్దా రష్యాలోని ప్రముఖ బెట్టింగ్ కేంద్రంలో గతంలో పని చేసినట్లు గుర్తించారు పోలీసులు. ఈ విషయం తెలిసిన క్రికెట్ అభిమానులు ఇదేందయ్య ఇది.. అంటూ.. షాక్ అవుతున్నారు.
తాజావార్తలు
-
Russia-US: డీజిల్ డీల్ తర్వాత.. అమెరికా-రష్యా మధ్య మరో భారీ ఒప్పందం..!
-
Airtel Recharge Plans: Airtel కొత్త రీఛార్జ్ ప్లాన్స్.. రూ.185, రూ.203, రూ.206.. వ్యాలిడిటీ, బెనిఫిట్స్ ఇవే!
-
Anupama Parameswaran: పెళ్లి చేసుకోవద్దని నేను ఎక్కడా చెప్పలేదు: అనుపమ
-
World Protests: ఫ్రాన్స్ నుంచి అమెరికా వరకు.. 8 దేశాల్లో నిరసనల సెగ.. కారణాలివే!
-
PM-VBRY Scheme 2026: తొలిసారి ఉద్యోగం చేసేవారికి రూ.15,000.. రెండో విడత డబ్బుల కోసం ఈ కోర్సు తప్పనిసరి!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!