F-35B Fighter Jet: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, అత్యంత అడ్వాన్సుడ్ 5వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్ ఎఫ్-35బీ ఫైటర్ జెట్, సాంకేతికత కారణాలతో కేరళలోని తిరువనంతపురం ఎయిర్‌పోర్టులో దిగింది. అయితే, అప్పటి నుంచి దీని సాంకేతిక సమస్యలు దూరం కాలేదు. దీంతో గత మూడు వారాలుగా ఎయిర్‌పోర్టులోనే ఉంది. చివరకు 24 మంది నిపుణులు దీనిని రిపేర్ చేయడానికి భారత్ రావాల్సి వచ్చింది. మరమ్మతుల కోసం ఎయిర్‌పోర్టులోని హ్యాంగర్‌కి తరలించారు.