NTV Telugu Site icon

EXIT POLLS: మళ్లీ బీజేపీదే అధికారం.. ఎగ్జిట్ పోల్స్‌లో సంచలన ఫలితాలు..

Pm Modi

Pm Modi

Exit Polls Lok Sabha Elections 2024: 2024 లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠతో చూసిన లోక్‌సభ ఎన్నికలు-2024 ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. మరోసారి ప్రధాని నరేంద్రమోడీ అధికారంలోకి రాబోతున్నారని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 300 కన్నా అధిక స్థానాలను సాధిస్తున్నట్లు మెజారిటీ సంస్థల ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. సగటున ఏన్డీయేకి 365 సీట్లు,  మరోవైపు ఇండియా కూటమి 142 వరకు వస్తాయని అంచనా వేశాయి.

ఏప్రిల్ 19న ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ జూన్ 1తో ముగిసింది. మొత్తం 7 దశల్లో దేశంలోని 543 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. పార్లమెంట్ స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరిగాయి.

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మరోసారి అధికారంలోకి వస్తుందని, మోడీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపడుతారని బీజేపీ నాయకులు చెబుతున్నారు. ఈ సారి సొంతంగా బీజేపీకి 370 సీట్లతో పాటు ఎన్డీయే కూటమి 400+ స్థానాల్లో గెలుస్తుందని ‘‘ఔర్ ఏక్ బార్ 400 పార్’’ అనే నినాదంతో ఎన్నికల బరిలో నిలిచింది.మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఈ సారి తామే అధికారంలోకి వస్తామని చెబుతోంది. రాజ్యాంగాన్ని రక్షించేందుకు, విద్వేష రాజకీయాలకు ప్రజలంతా వ్యతిరేకంగా ఓటేశారని ధీమా వ్యక్తం చేసింది.

మరోవైపు ఈ రోజు ఇండియా కూటమి ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఇంట్లో సమావేశమయ్యారు. ఇండియా కూటమి 295 సీట్ల కన్నా ఎక్కువ సీట్లు సాధించి అధికారంలోకి రాబోతోందని ఖర్గే ధీమా వ్యక్తం చేశారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

మొత్తం పార్లమెంట్ స్థానాలు: 543, మ్యాజిక్ ఫిగర్: 272

దైనిక్ భాస్కర్:
ఎన్డీయే:281-350
ఇండియా కూటమి: 145-201
ఇతరులు: 33-49
———-
ఇండియా న్యూస్-D-డైనమిక్స్:

ఎన్డీయే: 371
ఇండియా కూటమి: 125
ఇతరులు: 47
————-
జన్ కీ బాత్:

ఎన్డీయే: 362-392
ఇండియా కూటమి: 141-161
ఇతరులు: 10-20
———————–
రిపబ్లిక్ భారత్-మాట్రిక్స్:

ఎన్డీయే: 353-368
ఇండియా కూటమి: 118-133
ఇతరులు: 43-48
———————–
రిపబ్లిక్ టీవీ:

ఎన్డీయే: 359
ఇండియా కూటమి: 154
ఇతరులు: 30
————————
ఎన్డీ టీవీ:

ఎన్డీయే: 365
ఇండియా కూటమి: 142
ఇతరులు: 36