మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అనారోగ్యం నుంచి కోలుకున్నారు. ఈ మేరకు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రి నుంచి మన్మోహన్ సింగ్ డిశ్చార్జి అయ్యారు. ఈనెల 13న ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్పించారు. ఆ తర్వాత డెంగీ నిర్ధారణ అయినట్లు వైద్యులు ప్రకటించారు. అప్పటి నుంచి మన్మోహన్ సింగ్ ఎయిమ్స్‌లోనే ఉండి చికిత్స తీసుకున్నారు.
తాజాగా ఆయన పూర్తిగా కోలుకోవడంతో ఆదివారం నాడు ఎయిమ్స్ వైద్యులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. కాగా ఎయిమ్స్ ఆస్పత్రిలోని కార్డియో న్యూరో సెంటర్లోని ప్రైవేట్ వార్డులో మన్మోహన్ సింగ్‌కు చికిత్స అందించారు. కాగా మన్మోహన్ ఆస్పత్రి డిశ్చార్జ్ కావడంతో ఆయన కుటుంబంతో పాటు కాంగ్రెస్ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో కరోనా వైరస్ బారిన పడిన మన్మోహన్ సింగ్ ఎయిమ్స్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో నెల రోజుల పాటు వైద్యం పొందిన తర్వాత మన్మోహన్ డిశ్చార్జ్ అయ్యారు.
Also Read: నవంబర్ 1 నుంచి ఏం మారనున్నాయి?