1984 anti-Sikh riots: 1984 సిక్కుల ఊచకోత కేసులో దోషిగా తేలిన కాంగ్రెస్ మాజీ ఎంపీ..
- 1984 సిక్కుల ఊచకోత కేసులో కీలక పరిణామం..
- దోషిగా తేలిన కాంగ్రెస్ మాజీ ఎంపీ..
- ఇందిరా గాంధీ హత్య తర్వాత పెద్ద ఎత్తున సిక్కు వ్యతిరేక అల్లర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
1984 anti-Sikh riots: 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్‌ని ఢిల్లీ కోర్టు బుధవారం దోషిగా తేల్చింది. సిక్కుల ఊచకోత సమయంలో సరస్వతి విహార్ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తుల హత్యల కేసులో సజ్జన్ కుమార్ ప్రమేయం ఉన్నట్లుగా కోర్టు చెప్పింది. ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా దోషిగా తేల్చింది, ఫిబ్రవరి 18న తీర్పును వెలువరించనున్నారు. అదే రోజు శిక్షలను ఖరారు చేయనున్నారు. ఈ కేసులో తీర్పు కోసం సజ్జన్ కుమార్‌ని తీహార్ జైలు నుంచి కోర్టులో హాజరుపరిచారు.
Read Also: Saaree Movie: రామ్ గోపాల్ వర్మ ‘శారీ’ మూవీ నుండి స్టన్నింగ్ ట్రైలర్ రిలీజ్..
Also Read
- ACP Vivek Bhagat: ‘‘కులం పేరుతో దూషించారు, నా పరువు తీశారు’’.. సీజేపీ నేతలపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు..
- Salary Hike 2026-27: ఉద్యోగులకు గుడ్న్యూస్.. భారీగా పెరగనున్న జీతాలు!.. ఏ రంగంలో ఎక్కువంటే?
- Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీని వెంబడిస్తున్న కేసులు.. కోర్టు సమన్లు జారీ..
- Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
ఈ కేసు నవంబర్ 01, 1984 జస్వంత్ సింత్, అతడి కుమారుడు తరణ్ దీప్ సింగ్ హత్యలకు సంబంధించింది. పంజాబీ బాగ్ పోలీస్ స్టేషన్ మొదట కేసు నమోదు చేసినప్పటికీ, ఆ తర్వాత దీనిని ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించింది. డిసెంబర్ 16, 2021న, కోర్టు కుమార్‌పై అభియోగాలు మోపింది. ఇతడి ప్రమేయం ఉన్నట్లు తేల్చింది.
ప్రాసిక్యూషన్ ప్రకారం.. మారణాయుధాలతో సాయుధులైన ఒక భారీ గుంపు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యకు ప్రతీకారం తీర్చుకోవడానికి పెద్ద ఎత్తున దోపిడీలు, దహనాలతో పాటు సిక్కుల్ని టార్గెట్ చేశారు. ఈ గుంపు తమ ఇంటిపై దాడి చేసి తన భర్త, కొడుకును చంపినట్లు జస్వంత్ సింగ్ భార్య ఫిర్యాదు చేసింది. ఇంట్లో వస్తువుల్ని దోచుకుని వారి ఇంటిని తగులబెట్టినట్లు ప్రాసిక్యూషన్ ఆరోపించింది. సజ్జన్ కుమార్‌పై విచారణ జరుపుతూ.. ‘‘అతను కేవలం అందులో పాల్గొనే వాడు మాత్రమే కాదని, ఆ గుంపుకు నాయకత్వం వహించాడు’’ అందుకు సంబంధించిన ఆధారాలు లభించాయని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..