NTV Telugu Site icon

RSS Chief Mohan Bhagwat: భారత్‌లో మాట్లాడే ప్రతి భాషా జాతీయ భాషనే..

Rss

Rss

RSS Chief Mohan Bhagwat: రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ ఏర్పాటై 100వ ఏడాదిలోకి అడుగు పెట్టిన సందర్భంగా ఈ విజయదశమిని పురస్కరించుకొని మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్‌ భగవత్‌, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఇస్రో మాజీ ఛైర్మన్ డాక్టర్.రాధాకృష్ణన్ లాంటి ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోహన్ భగవత్ మాట్లాడుతూ.. భారత్‌లో మాట్లాడే ప్రతి భాషా జాతీయ భాషే అని పేర్కొన్నారు. అలాగే, సామాజిక ఐక్యత, సామరస్యం కోసం కులమతాలకు అతీతంగా వ్యక్తుల మధ్య స్నేహం ఉండాలన్నారు. బంగ్లాదేశ్‌లో హిందూవులపై జరిగిన దాడులను ఆయన ఖండించారు. ప్రాంతంతో సంబంధం లేకుండా ఐక్యంగా ఉంటే.. ఎలాంటి గొడవలకు తావుండదన్నారు. అలాగే, ఇజ్రాయెల్‌-హమాస్ మధ్య జరుగుతోన్న యుద్ధంపై మోహన్ భగవత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

Read Also: ICICI Bank Scam Case: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ స్కామ్.. సెల్పీ వీడియోతో బ్యాంక్‌ మేనేజర్ సంచలనం..

ఇక, దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న బెంగాల్‌ ఆర్జీకర్ హస్పటల్ లో జరిగిన హత్యాచార ఘటనపై కూడా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పందించారు. మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత సర్కార్ ది.. నేరం జరిగినప్పటికీ, బాధితురాలికి న్యాయం జరగకపోవడం సమాజాన్ని నిరుత్సాహపరుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్‌ లీడర్ సురేశ్‌ భయ్యాజీ మాట్లాడుతూ.. రాష్ట్రాలు వేరు వాటి సంస్కృతులు, భాషలు వేర్వేరు.. ఒక భాషే గొప్పదనే అనవసర భ్రమను కొందరు సృష్టిస్తున్నారని చెప్పుకొచ్చారు. తమిళం, మలయాళం, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, హిందీ.. ఇలా భారతీయులు మాట్లాడే ప్రతి భాషా.. జాతీయ భాషే అని చెప్పుకొచ్చారు. భాష వేరు అయినా.. ఒక భారతీయుడిగా మన ఆలోచన ఒకే విధంగా ఉంటుందన్నారు.

Show comments