Mamata Banerjee: ‘‘ఇందిరా గాంధీ కూడా ఓడిపోయింది’’.. బీజేపీకి మమత వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: ‘‘ఇందిరా గాంధీ కూడా ఓడిపోయింది’’.. బీజేపీకి మమత వార్నింగ్..టీఎంసీ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి బీజేపీపై ఫైర్ అయ్యారు. ఇందిరాగాంధీ హాయాంలో కాంగ్రెస్ విధించిన ఎమర్జెన్సీతో బీజేపీ పాలనను పోల్చారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రం, దర్యాప్తు సంస్థల్ని ఉపయోగించి తమ నేతల్ని అరెస్ట్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం చేతులు కలిపాయని మమతా బెనర్జీ ఆరోపించారు.
Read Also: Russia Ukraine War: ఉక్రెయిన్‌లోని అవ్దివ్కా నగరాన్ని స్వాధీనం చేసుకున్న రష్యా.. పుతిన్ ప్రశంసలు
Also Read
- Kailash Mansarovar Yatra 1981: కైలాసానికి దారి మూసేసిన చైనా.. తెరిపించిన సుబ్రహ్మణ్యస్వామి.. 1981 నాటి ఆసక్తికర కథ..
- Fitna al-Hindustan: ఇండియానే టార్గెట్ చేస్తోన్న పాకిస్థాన్.. ‘ఫిత్నా అల్-హిందుస్తాన్’ పేరుతో కొత్త కుట్ర?
- Kerala Road A*ccident: ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న కారు, 8 మంది మృతి
- Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
రాష్ట్రంలో టీఎంసీ నేతల్ని కేంద్ర సంస్థలు అరెస్ట్ చేయడం 1970లో ఎమర్జెన్సీ సమయంలో ప్రతిపక్ష నేతల్ని అరెస్ట్ చేయడంతో పోల్చారు. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఎన్నికల్లో ఓడిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. ‘‘1975-77లో ఎమర్జెన్సీ కాలంలో 2000 మందిని జైల్లో పెట్టారు. ఎన్నికల్లో గెలుస్తామని ఇందిరా గాంధీ భావించారు. అయినా ఓడిపోయారు. నేడు ఈడీని, సీబీఐని ఎన్నికల కోసం బీజేపీ ఉపయోగిస్తోంది’’ మమతా బెనర్జీ బీర్బూమ్ బహిరంగ సభలో అన్నారు. ఈ రోజు కూడా సీబీఐ, ఈడీ, ఎన్నికల కమిషన్‌ని ఉపయోగించి ప్రజల్ని జైలులో పెట్టడాన్ని వ్యతిరేకించే హక్కు మనకు కూడా ఉందని ఆమె అన్నారు.
మనీలాండరింగ్ కింద మాజీ మంత్రులతో సహా పలువురు టీఎంసీ నాయకుల్ని అరెస్ట్ చేయడాన్ని ప్రస్తావిస్తూ.. బీజేపీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు వారిని జైళ్లకు పంపించిందని ఆరోపించారు. ఎలాంటి రుజువులు లేకుండా జైలులో ఉంచడం ద్వారా గెలుపొందాలని చూస్తున్నట్లు మమతా అన్నారు. టీఎంసీపై బీజేపీ దాడులు చేస్తోందని, అయితే బీజేపీలో ఒక్క నాయకుడిపైనైనా చర్య తీసుకుందా.? అని ప్రశ్నించారు. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సి), అలాగే పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) అమలుకు బిజెపి కుట్ర చేస్తోందని మమతా బెనర్జీ ఆరోపించారు. యూనిఫాం సివిలో కోడ్ అమలు పేరుతో బీజేపీ ఆట ఆడుతోందని చెప్పారు.
తాజావార్తలు
-
Oppo A7 Pro: ఒప్పో A7 Pro లాంచ్ డేట్ ఫిక్స్.. 8000mAh బ్యాటరీ, 80W ఛార్జింగ్, IP69K రేటింగ్!
-
AP School Education Department: మెగా DSC-2025 నియామకంపై కీలక ప్రకటన.. విచారణకు ఆదేశించిన విద్యాశాఖ
-
KAAKA: మెగా అభిమానులకు మాస్ ట్రీట్.. సంక్రాంతి రేసులోనే చిరు! క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
-
Top 7 Indian Sequels: ఇండియన్ సినీ హిస్టరీలోనే అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 7 సీక్వెల్స్ ఇవే!
-
Pickaxe Mountain: ‘త్వరలో పికాక్స్ పర్వతంపై దాడి చేస్తాం’ ఇరాన్ కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!