KAAKA: మెగా అభిమానులకు మాస్ ట్రీట్.. సంక్రాంతి రేసులోనే చిరు! క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KAAKA: మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ (కె.ఎస్. రవీంద్ర) కాంబినేషన్లో అత్యంత ప్రతిష్ఠాత్మంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కాకా’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. గతంలో ఈ కాంబినేషన్లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బ్లాక్‌బస్టర్ కావడంతో కాకాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ‘కాకా’ షూటింగ్‌కు సంబంధించి మేకర్స్ కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ సెప్టెంబర్ 7 నుంచి హైదరాబాద్‌లో స్టార్ట్ కానుందని వెల్లడించారు. సుదీర్ఘంగా సాగనున్న ఈ షెడ్యూల్లో సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలతో పాటు హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరించనున్నట్లు సమాచారం. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత వెంకట్ నారాయణ నిర్మిస్తున్నారు. షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేస్తూ 2027 సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక ఈ చిత్రంలో చిరంజీవి సరికొత్త లుక్‌లో కనిపించనుండగా.. అనస్వర రాజన్, నివేతా పేతురాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ యాక్షన్ అంశాలతో తెరకెక్కుతున్న ‘కాకా’పై ఇప్పటికే అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. తాజా షూటింగ్ షెడ్యూల్ అప్డేట్తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
ఇటీవల ఈ సినిమా రిలీజ్ డేట్ మారనుందనే వార్తలకు తాజాగా మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాను 2027 సంక్రాంతి బరిలో దింపుతున్నట్లు తాజా అప్డేట్తో మరోసారి స్పష్టం చేశారు. ఇటీవల ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి రావడం లేదనే రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సంక్రాంతికి పలు పెద్ద సినిమాలు ఉండటంతో థియేటర్ల సర్దుబాటు, పోటీ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కాకా మేకర్స్ రిలీజ్ వాయిదా వేసే దిశగా ఆలోచిస్తున్నట్లు సోషల్ మీడియాలో పలు రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి. సంక్రాంతి హడావుడిని తప్పించి, బాక్సాఫీస్ వద్ద సోలోగా మెగా మాస్ విధ్వంసం సృష్టించేందుకు వీలుగా ‘కాకా’ను 2027 సమ్మర్ సీజన్‌కు వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయని పలువురు పోస్ట్‌లు చేశారు. అయితే తాజాగా మేకర్స్ ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ అప్డేట్తో పాటు ఈ రూమర్స్‌పై కూడా కార్లిటీ ఇచ్చారు. ఈ మెగా మూవీ పక్కా జనవరి 13, 2027 తేదీనే థియేటర్స్‌లోకి రాబోతుందని స్పష్టం చేశారు. దీంతో కాకా రిలీజ్ వాయిదా అనే ప్రచారానికి ఫుల్‌స్టాఫ్ పడినట్లు అయ్యింది.
Also Read
- బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
- Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో సుకుమార్ సినిమా లేనట్టేనా? అసలు కథ ఇదేనా!
- Hanuman Ansh : 'హనుమాన్ అంశ్'చూడాలన్న తెలుగు ఆడియన్స్ కల తీరుతుందా?
- The Paradise: నాని అతిపెద్ద రిస్క్.. 'ది పారడైజ్' బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా? ట్రేడ్ లెక్కలు ఇవే!
తాజావార్తలు
-
Astrology: సెప్టెంబర్ 25 శుక్రవారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పరిహారం చెల్లించాలంటే..?
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!