Kerala Road A*ccident: ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న కారు, 8 మంది మృతి
- కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం
- నిలిపి ఉన్న లారీని ఢీకొన్న కారు
- 8 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala Road Accident: కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. త్రిశూర్ జిల్లాలో జాతీయ రహదారి-66పై శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 8 మంది మృతి చెందారు. శనివారం తెల్లవారుజామున ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కైపమంగళం పరిధిలోని పనంబికున్ను వద్ద NH-66పై ఓ లారీని రోడ్డుపై నిలిపి ఉంచారు. శుక్రవారం రాత్రి సుమారు 11.40 గంటల సమయంలో గురువాయూర్ నుంచి కొడుంగల్లూర్ వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి నిలిపి ఉన్న లారీని బలంగా ఢీకొట్టింది.
ప్రమాద తీవ్రతతో నుజ్జునుజ్జైన కారు
కారు లారీని ఢీకొన్న సమయంలో ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమై, అందులో ఉన్నవారు బయటకు రావడానికి వీలు లేకుండా చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కారులో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు అధికారులు వాహనాన్ని కట్ చేయాల్సి వచ్చింది. అయితే అప్పటికే కారులో ఉన్న ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.
Also Read
- Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
- West Bengal: ‘‘అమ్మాయిలు 3 నెలల స్కర్టులు ధరించొద్దు’’.. బెంగాల్ మంత్రి ఎందుకు ఇలా చెప్పారు.?
- Free LPG Cylinders Scheme: గుడ్‌న్యూస్ చెప్పిన గోవా సీఎం.. 3 ఎల్పీజీ సిలిండర్లు ఫ్రీ.. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్
- RG Kar Case: ఆర్జీ కర్ కేసులో కీలక పరిణామం.. నిందితుడిపై రాళ్లు, ఇటుకలతో దాడి
మృతులు తమిళనాడుకు చెందిన విద్యార్థులుగా అనుమానం
మృతులంతా పొరుగున ఉన్న తమిళనాడు రాష్ట్రానికి చెందినవారిగా పోలీసులు తెలిపారు. వీరు విద్యార్థులు అయి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. వీరు గురువాయూర్ నుంచి కొడుంగల్లూర్ వైపు ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే మృతుల పూర్తి వివరాలు, గుర్తింపును అధికారులు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.
మృతదేహాలు త్రిశూర్ మెడికల్ కాలేజీకి తరలింపు
ప్రమాదంలో మృతి చెందిన వారి మృతదేహాలను త్రిశూర్ మెడికల్ కాలేజీ మార్చురీకి తరలించారు. త్వరలో పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. మృతుల గుర్తింపుపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే కొన్ని మీడియా కథనాల ప్రకారం, మృతులు తమిళనాడులోని దిండిగల్‌కు చెందిన PSNA ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు అయి ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారికంగా ఎలాంటి ధృవీకరణ వెలువడలేదు. ప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఏమిటి? లారీని ఏ పరిస్థితుల్లో రోడ్డుపై నిలిపారు? కారు వేగం ఎంత ఉంది? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Kerala Road A*ccident: ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న కారు, 8 మంది మృతి
-
BC Reservations: బీసీ రిజర్వేషన్లపై పిల్ కొట్టేయండి.. హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్
-
Saturday Horoscope: సెప్టెంబర్ 5 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్‌న్యూస్..
-
Royal Enfield Himalayan 440 Launched: 24.4 HP పవర్‌తో కొత్త అడ్వెంచర్ బైక్.. ధర, మైలేజ్, ఫీచర్లు ఏంటంటే..?
-
Vaishnavi : “గూగుల్ లో నీ పేరు కొడితే ఏమొస్తుందని అవమానించారు”
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!