రోడ్డు ప్రమాదాల గురించి పోలీసులు ఎన్ని నివారణ చర్యలు చేపట్టినప్పటికీ.. ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు. అతి వేగం మనుషుల ప్రాణాలను బలికొంటుంది. ఈ క్రమంలో.. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన బైక్ చెట్టును ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ మేరకు ఆదివారం పోలీసులు సమాచారం అందించారు. శనివారం రాత్రి లైలుంగా పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్రహన్ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు.
ఛత్తీస్‌గఢ్ లోని రాయ్‌గఢ్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ బ్యాంకులో మంగళవారం తెల్లవారుజామున భారీ దోపిడీ జరిగింది. ఉదయం బ్యాంకు తెరిచిన తర్వాత కొందరు దుండగులు హఠాత్తుగా బ్యాంకులోకి ప్రవేశించారు. తొలుత బ్యాంకు మేనేజర్‌ను కత్తితో పొడిచిన దుండగులు.. మిగిలిన బ్యాంకు ఉద్యోగులను బందీలుగా చేసుకుని నగదు, బంగారం, వెండితో పరారయ్యారు.
Landslide: మహారాష్ట్రలోని రాయగఢ్‌లో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడిన ఘటన వెలుగులోకి వచ్చింది. అర్థరాత్రి జరిగిన ఈ పెను ప్రమాదంలో 30కి పైగా కుటుంబాలు శిథిలాల కింద సమాధి అయ్యాయని భయాందోళన చెందుతున్నారు.
మహారాష్ట్రలోని రాయగఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఉదయం ముంబై-గోవా హైవేపై కారు ట్రక్కును ఢీకొనడంతో ఒక చిన్నారి, ముగ్గురు మహిళలు సహా తొమ్మిది మంది మృతి చెందారు.