హెల్మెట్స్ పెట్టుకొని పనిచేస్తున్న ఉద్యోగులు.. ఎందుకో తెలిస్తే షాకే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా బండి మీద హెల్మెట్ పెట్టుకొని వెళ్ళమంటేనే కొంతమంది ఏదోలా చూస్తారు. ఇక పోలీసుల భయంతో మరికొంతమంది హెల్మెట్స్ పెట్టుకొంటారు. కానీ, ఈ హాస్పిటల్ లో పనిచేసే ఉద్యోగులు మాత్రం ఉద్యోగం చేస్తున్నంతసేపు హెల్మెట్ ని ధరిస్తూనే ఉంటారు.. ఆహా ఎంత బాధ్యత అని అనుకోకండి.. ఎందుకంటే వారి -ప్రాణాలను కాపాడుకోవడానికి వారికున్న ఏకైక మార్గం అదొక్కటే.. అదేంటీ.. హెల్మెట్ తో ప్రాణాలు కాపాడుకోవడం ఏంటి అని అనుకుంటున్నారా..? మరి ఆ హాస్పిటల్ పరిస్థితి అంత అద్వానంగా ఉంది కాబట్టి.. ఎప్పుడు ఏ పెచ్చు ఉండి తలమీదపడుతుందో తెలియదు కాబట్టి.. బీహార్‌లోని కైమూర్ జిల్లాలోని దుర్గావతి ప్రైమరీ హెల్త్ సెంటర్ లోని దుస్థితి ఇది.
ఎన్నో ఏళ్లుగా కట్టిన హాస్పిటల్ కావడంతో ఎండకు ఎండి, వానకు తడిసి శిధిలావస్థకు చేరుకొంది. ఈ భవనం ఎప్పుడు కూలిపోతుందో ఎవరు చెప్పలేరు. ఇటీవల ఇద్దరు ఉద్యోగుల తలపై పెచ్చులు ఊడిపడి గాయాలపాలయ్యారు. దీంతో ఉద్యోగులందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. విధులు నిర్వహించేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. ఏ పెచ్చు ఊడినా హెల్మెట్ ఉంటుంది కాబట్టి ప్రాణాపాయం ఉండదు అని వారు భావించారు. ఇకపోతే ఈ శిధిలావస్థ భవనం ప్లేస్ లో కొత్త భవనం నిర్మించనున్నామని, కొద్దిరోజులు ఓపిక పెట్టాల్సిందిగా ఉద్యోగులకు పీహెచ్‌సీ ఇన్‌చార్జ్ తెలిపారు.
Also Read
- New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
- LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
- Rahul Gandhi's SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
- India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
తాజావార్తలు
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
-
Off The Record: నమ్మినవాళ్లే జనసేనను ముంచుతున్నారా… ఈ సారి గ్లాస్ ప్లాన్ ఏంటి…?
-
New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
-
Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?