NTV Telugu Site icon

EC: ఈవీఎంల ట్యాంపిరింగ్‌పై ఎన్నికల సంఘం క్లారిటీ.. సీఈసీ ఏమన్నారంటే..!

Rajivkumar

Rajivkumar

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసిందంటూ కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. హర్యానా ఫలితాలను అంగీకరించబోమని స్పష్టం చేసింది. అంతేకాకుండా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి కూడా ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా సీఈసీ రాజీవ్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. ఈవీఎంల ట్యాంపరింగ్‌పై కాంగ్రెస్ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. ఈవీఎంలను రిగ్గింగ్ చేయడం అసాధ్యం అని రాజీవ్ కుమార్ కొట్టిపారేశారు. ఇక ఎగ్జిట్ పోల్స్‌తో ఈసీకి సంబంధం ఉండదని స్పష్టం చేశారు. అయినా కూడా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చే వారు స్వీయ నియంత్రణ పాటించాలని ఆయా సంస్థలకు ఎన్నికల సంఘం సూచించింది.

ఇది కూడా చదవండి: Citadel: Honey Bunny Trailer: సమంత సిటాడెల్ ట్రైలర్ వచ్చేసింది.. చూశారా?

మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. మహారాష్ట్రలో ఒకే విడతలో నవంబర్ 20న పోలింగ్ జరుగుతోంది. జార్ఖండ్‌లో మాత్రం రెండు విడతల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. నవంబర్ 13, 20న ఓటింగ్ జరుగుతోంది. ఇక మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 23న విడుదల కానున్నాయి.

ఇటీవలే హర్యానా, జమ్మూకాశ్మీర్ ఎన్నికలు ముగిశాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కాంగ్రెస్ వైపే మొగ్గుచూశాయి. హస్తం పార్టీదే అధికారం అంటూ ఆయా సంస్థలు ఊదరగొట్టాయి. తీరా.. ఫలితాలు వచ్చేసరికి అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ముచ్చటగా మూడోసారి హర్యానాలో బీజేపీ అధికారం చేజిక్కించుకుంది. ఇక జమ్మూకాశ్మీర్‌లో ఎన్సీ-కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది. హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లుగా ఫలితాలు రాకపోయే సరికి.. కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. ఎన్నికల సంఘం మాత్రం కొట్టిపారేసింది.

ఇది కూడా చదవండి: Kishan Reddy : దేశ రక్షణ విషయంలో బీఆర్ఎస్ బాధ్యతా రహితంగా వ్యవహరిస్తోంది