El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
- ఎల్ నినోపై భారత వాతావరణ శాస్త్రవేత్తల ఆందోళన..
- వచ్చే రోజుల్లో దేశంపై తీవ్ర ప్రభావం చూపొచ్చని హెచ్చరిక..
- వేడి, వర్షాభావం, నీటి కొరత వంటి పరిస్థితులపై సూచనలు..
- వ్యవసాయం, అడవులు, పశుపోషణపై తీవ్ర ప్రభావం పడే ఛాన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
El Nino: రాబోయే కొన్ని రోజుల్లో భారతదేశంలో వాతావరణ పరిస్థితులు ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2026-27 ఎల్నినో సాధారణం కన్నా శక్తివంతంగా ఉండొచ్చని 180 మందికి పైగా పర్యావరణ, వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది దేశంలోని అడవులు, నదులు, సముద్రాలు, పర్వతాలు, వన్యప్రాణులపై తీవ్రమైన ప్రభావం చూపొచ్చని అంటున్నారు. నష్టం జరిగిన తర్వాత దానిని అధ్యయనం చేయడానికి బదులు, ముందుగానే పర్యవేక్షించేందుకు వీలుగా, ప్రభుత్వాలు, పరిశోధనా సంస్థలు వెంటనే సిద్ధం కావాలని సూచించారు.
‘‘సూపర్ ఎల్ నినో: 2026/2’’పై ఒక పరిశోధన జెనోడోలో ప్రచురితమైంది. ఎల్నినో అనేది సహజ వాతావరణ దృగ్విషయం. పసిఫిక్ మహాసముద్రంలో భూమధ్యరేఖకు సమీపంలోని ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా పెరుగుతాయి. దీని వల్ల రుతుపవన వ్యవస్థ దెబ్బతింటుది. ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరగడం, వర్షపాతంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ప్రపంచవాతావరణ సంస్థ నివేదిక ప్రకారం.. ఎల్ నినో ఇప్పటికే బలపడుతున్నట్లు చెప్పింది. 2027 ఫిబ్రవరి వరకు కొనసాగే అవకాశం దాదాపుగా 100 శాతం ఉంటుందని పేర్కొంది.
Also Read
2026 నవంబర్ నుంచి వచ్చే ఏడాది వరకు భారత్లోని అనేక ప్రాంతాల్లో సాధారణం కన్నా వేడి, పొడి వాతావరణం ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. తగ్గిన వర్షపాత నీటి కొరతను పెంచి వ్యవసాయం, అడవులు, పశుపోషణపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటికే నీటి కొరత ఎదుర్కొంటున్న ప్రాంతాలపై వేడి, కరువు ప్రభావం ఉంటుందని అంచనా. ఎడారి ప్రాంతాలు, ఎత్తైన పర్వత ప్రాంతాల్లో నివసించే మొక్కలు, జంతువుల మనుగడ కష్టంగా మారొచ్చు. నీటి వనరులపై ఒత్తిడి పడితే అది వ్యవసాయంపై, గ్రామీణ వ్యవస్థపై ఒత్తిడి పెంచొచ్చు. నగరాల్లో వేడి తీవ్రం కావచ్చు. కాంక్రీట్, రోడ్ల కారణంగా పట్టణాల్లో, గ్రామీణ ప్రాంతాల కన్నా అధిక వేడి ఉండే అవకాశం ఉంది. అడవుల్లో కార్చిచ్చు వృక్ష, వన్యప్రాణాలకు గణనీయమైన నష్టాన్ని కలిగించొచ్చని అంచనా. వాతావరణ మార్పులు జంతువుల ఆహారం, సంతానోత్పత్తిని దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
-
Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
-
OTR: కాంగ్రెస్ కంచుకోటలో గ్రూప్ వార్.. క్యాడర్లో పెరుగుతున్న అసంతృప్తి..
-
SJ Suryah Bodhi: ‘జైలర్ 2’ నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
-
Etela Rajender : ధరణి పేరుతో పేద రైతులకు తీవ్ర అన్యాయం
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!