Site icon NTV Telugu

26/11 Mumbai attacks: ఉగ్రవాదులపై చర్యలను అడ్డుకుంటున్నారు.. యూఎన్ వేదికగా చైనాపై పరోక్ష వ్యాఖ్యలు

Ruchika Kamboj

Ruchika Kamboj

Efforts to sanction terrorists behind 26/11 blocked for political reasons, says india: యావత్ భారతాన్ని భయాందోళకు గురి చేశాయి 26/11 ముంబై దాడులు. దాడులు జరిగి 14 ఏళ్లు అవుతున్నా.. ఇప్పటికే ప్రధాన సూత్రదారులైన లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాదులు పాకిస్తాన్ లో దర్జాగా తిరుగుతున్నారు. దాయాది దేశం పాకిస్తాన్ చర్యలు తీసుకోవడం లేదు. దాడిలో పాల్గొని దొరికిన ఒకే ఒక ఉగ్రవాది అజ్మల్ కసబ్ ను భారతప్రభుత్వం ఉరి తీసింది. అయితే కుట్ర పన్నిన లష్కరే చీఫ్ హఫీస్ సయీద్ మాత్రం లాహోర్ లో రాచభోగాలు అనుభవిస్తున్నాడు.

Read Also: Border violence: నివురుగప్పిన నిప్పులా అస్సాం-మేఘాలయ సరిహద్దు.. శాంతి చర్చలకు ప్రయత్నం

ఇదిలా ఉంటే ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు భారత్ చేసే ప్రయత్నాలను ఎప్పటికప్పుడు ఐక్యరాజ్యసమితిలో అడ్డుకుంటోంది చైనా. 26/11 ముంబాయి దాడులకు పాల్పడిన వారిని శిక్షించేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలను ‘రాజకీయ కారణాల’తో అడ్డుకుంటున్నారని ఐరాసలో శాశ్వత ప్రతినిధి రుచికా కాంబోజ్ చైనా తీరుపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఇలాంటి చర్యలు భారతదేశానికి వ్యతిరేకంగా దాడులను ప్రేరేపించేందుకు వీలు కల్పిస్తుందని అన్నారు.

యూఎన్ వేదికగా ఆ నాటి ఘోరాన్ని మరోసారి గుర్తిచేశారు రుచికా కాంబోజ్. నవంబర్ 26,2008 నాడు 10 మంది ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి బోటు ద్వారా ముంబై తీరానికి చేరుకుని ఉగ్రదాడులు చేశారని.. 4 రోజుల పాటు నగరాన్ని గుప్పిట పెట్టుకుని 166 మందిని చంపేశారని.. వీరిలో 26 మంది విదేశీ పౌరులు ఉన్నారని ఆమె అన్నారు. ముఖ్యంగా ఐసిస్, అల్ ఖైదా ఆసియా, ఆఫ్రికా ప్రాంతాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తూ.. అంతర్జాతీయ శాంతికి, భద్రతకు ముప్పుగా మారారని ఆమె అన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాది లష్కరేతోయిబా చీఫ్ హఫీస్ సయీద్ కొడుకు హఫీస్ తలా సయీద్‌ను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చి, అతన్ని “గ్లోబల్ టెర్రరిస్ట్”గా పేర్కొనాలని భారతదేశం, అమెరికా చేసిన ప్రతిపాదనను చైనా పలుమార్లు అడ్డుకుంది.

Exit mobile version