26/11 Mumbai attacks: ఉగ్రవాదులపై చర్యలను అడ్డుకుంటున్నారు.. యూఎన్ వేదికగా చైనాపై పరోక్ష వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Efforts to sanction terrorists behind 26/11 blocked for political reasons, says india: యావత్ భారతాన్ని భయాందోళకు గురి చేశాయి 26/11 ముంబై దాడులు. దాడులు జరిగి 14 ఏళ్లు అవుతున్నా.. ఇప్పటికే ప్రధాన సూత్రదారులైన లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాదులు పాకిస్తాన్ లో దర్జాగా తిరుగుతున్నారు. దాయాది దేశం పాకిస్తాన్ చర్యలు తీసుకోవడం లేదు. దాడిలో పాల్గొని దొరికిన ఒకే ఒక ఉగ్రవాది అజ్మల్ కసబ్ ను భారతప్రభుత్వం ఉరి తీసింది. అయితే కుట్ర పన్నిన లష్కరే చీఫ్ హఫీస్ సయీద్ మాత్రం లాహోర్ లో రాచభోగాలు అనుభవిస్తున్నాడు.
Read Also: Border violence: నివురుగప్పిన నిప్పులా అస్సాం-మేఘాలయ సరిహద్దు.. శాంతి చర్చలకు ప్రయత్నం
Also Read
- Tamil Nadu Budget 2026: జెన్-జెడ్ విద్యార్థులపై ప్రభుత్వం వరాల జల్లు.. గోల్డ్ కాయిన్స్, పట్టు చీరలు, సైకిళ్ల పంపిణీ..!
- PM Modi: "మార్క్ జుకర్‌బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే..." మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్‌లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
- Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
ఇదిలా ఉంటే ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు భారత్ చేసే ప్రయత్నాలను ఎప్పటికప్పుడు ఐక్యరాజ్యసమితిలో అడ్డుకుంటోంది చైనా. 26/11 ముంబాయి దాడులకు పాల్పడిన వారిని శిక్షించేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలను ‘రాజకీయ కారణాల’తో అడ్డుకుంటున్నారని ఐరాసలో శాశ్వత ప్రతినిధి రుచికా కాంబోజ్ చైనా తీరుపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఇలాంటి చర్యలు భారతదేశానికి వ్యతిరేకంగా దాడులను ప్రేరేపించేందుకు వీలు కల్పిస్తుందని అన్నారు.
యూఎన్ వేదికగా ఆ నాటి ఘోరాన్ని మరోసారి గుర్తిచేశారు రుచికా కాంబోజ్. నవంబర్ 26,2008 నాడు 10 మంది ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి బోటు ద్వారా ముంబై తీరానికి చేరుకుని ఉగ్రదాడులు చేశారని.. 4 రోజుల పాటు నగరాన్ని గుప్పిట పెట్టుకుని 166 మందిని చంపేశారని.. వీరిలో 26 మంది విదేశీ పౌరులు ఉన్నారని ఆమె అన్నారు. ముఖ్యంగా ఐసిస్, అల్ ఖైదా ఆసియా, ఆఫ్రికా ప్రాంతాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తూ.. అంతర్జాతీయ శాంతికి, భద్రతకు ముప్పుగా మారారని ఆమె అన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాది లష్కరేతోయిబా చీఫ్ హఫీస్ సయీద్ కొడుకు హఫీస్ తలా సయీద్‌ను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చి, అతన్ని “గ్లోబల్ టెర్రరిస్ట్”గా పేర్కొనాలని భారతదేశం, అమెరికా చేసిన ప్రతిపాదనను చైనా పలుమార్లు అడ్డుకుంది.
తాజావార్తలు
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
-
SpaceX Rocket Moon Crash: గంటకు 8,690 కి.మీ వేగంతో.. చంద్రుడిని ఢీకొట్టనున్న SpaceX రాకెట్..!
-
Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
-
Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
ట్రెండింగ్
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?