ED: ప్రస్తుతం భారతదేశంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులపై వరుస దాడులు జరగటం ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా ఓ కేసు నేపథ్యంలో క్యాసినో నౌకలో తనిఖీల కోసం ఈడీ అధికారులు వెళ్లగా.. వారిపై దాడి జరిగిన ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. గోవాలోని ఆఫ్‌షోర్ క్రూయిస్ ప్రైడ్ క్యాసినో నౌకలో సోదాలు నిర్వహించేందుకు ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ పోలూరి చెన్నకేశవరావుతో పాటు మరో ఇద్దరు సిబ్బంది వెళ్లగా.. వారిపై క్యాసినో డైరెక్టర్, అతడి అనుచరులు దాడి చేసినట్లు గోవా పోలీసులు పేర్కొన్నారు.
Read Also: IND vs AUS 3rd Test: వరుణుడి ఆటంకం.. మొదటి రోజు ముగిసిన ఆట
అయితే, మనీలాండరింగ్ కేసుకు సంబంధించి తాము స్వాధీనం చేసుకున్న ఆధారాలను సైతం నాశనం చేశారని ఈడీ అధికారులు ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని మమల్ని నిందితులు బెదిరించారని వారు వెల్లడించారు. గత నెలలో ఢిల్లీలోని బిజ్వాసన్ ఏరియాలో ఓ సైబర్ మోసం కేసును ఈడీ అధికారులు విచారణ చేస్తుండగా.. పలువురు దుండగులు వారిపై దాడి చేశారు. అలాగే, జనవరిలో పశ్చిమ బెంగాల్‌ల్లోని సందేశ్‌ఖాలీలో కేసు దర్యాప్తుకు వెళ్లిన ఈడీ అధికారులపై స్థానికులు దాడి చేయడంతో ముగ్గురు అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. క్రమంగా అధికారులపై దాడులు పెరిగిపోవడంతో కేంద్ర దర్యాప్తు సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది.