Ranya Rao Gold Smuggling Case: కర్ణాటక రాష్ట్రంలో సంచలనం రేపిన నటి రన్యా రావు బంగారు స్మగ్లింగ్ కేసులో కీలక అప్ డేట్ చోటు చేసుకుంది. ఈ కేసును విచారణ చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మరోసారి దూకుడు పెంచింది. బంగారం స్మగ్లింగ్ కేసులో భాగంగా ఈరోజు కర్ణాటకలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ కేసులో రాష్ట్ర హోం మంత్రి జి. పరమేశ్వరకు సంబంధించిన ఒక మెడికల్ కాలేజీలో తనిఖీలు చేసింది. అయితే, శ్రీ సిద్ధార్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఛైర్మన్‌గా హోంమంత్రి పరమేశ్వర ఉన్నట్లు ఈడీ గుర్తించింది. ఈ సందర్భంగా రన్యా రావు, హోంమంత్రి పరమేశ్వరకు సంబంధించిన డబ్బు కాలేజీలో ఉన్నట్లు ఈడీ కనుగొంది. ఈ సందర్బంగా కాలేజీ యొక్క ఆర్థిక రికార్డులను ఈడీ పరిశీలిస్తోంది.
Read Also: Terror Bid Foiled: పోలీస్ కస్టడీకి సిరాజ్, సమీర్.. 5 రోజులపాటు విచారించనున్న పోలీసులు
అయితే, మార్చి 3వ తేదీన బెంగళూరు విమానాశ్రయంలో రన్యా రావు అరెస్టు అయింది. అనంతరం రాజకీయ నాయకులతో ఆమెకు ఉన్న సంబంధాలపై ఆధారాలు లేని సమాచారం వచ్చినట్లు ఈడీ తెలిపింది. ఇక, నటి రన్యా రావు వివాహానికి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, హోంమంత్రి పరమేశ్వర హాజరైన ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. దీంతో అక్రమ బంగారం రవాణా కేసులో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురి పాత్ర ఉందని బీజేపీ ఆరోపించింది.
