Special Summary Revision: SIR వివాదం మధ్య ఈసీ కీలక నిర్ణయం.. 17 రాష్ట్రాల్లో ఓటరు జాబితాల సవరణకు ఆదేశాలు!
- 17 రాష్ట్రాల్లో ఓటరు జాబితాల సవరణకు ఈసీ ఆదేశాలు!
- SSR నిర్వహించనున్న 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
EC Orders Voter List Revision in 17 States: ఓటరు జాబితాలను మరింత కచ్చితంగా రూపొందించడంతో పాటు అర్హులైన పౌరులకు ఓటు హక్కు కల్పించే లక్ష్యంతో 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రత్యేక సంక్షిప్త సవరణ (Special Summary Revision – SSR) చేపట్టాలని భారత ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ ప్రక్రియలో యువ ఓటర్లు, తొలిసారి ఓటు హక్కు పొందే అర్హులైన పౌరుల నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1950లోని సెక్షన్ 21 ప్రకారం ఈ సవరణ చేపట్టాలని, 2027 జనవరి 1ను అర్హత తేదీగా నిర్ణయించింది. ఇప్పటికే ఓటరు జాబితాలో ఉన్న వివరాల్లో తప్పులను సరిచేయడం, అర్హులైన వారి పేర్లు చేర్చడం, జాబితా ఖచ్చితత్వాన్ని మెరుగుపరచడం ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశాలు.
SSR నిర్వహించనున్న 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు
1. అండమాన్ నికోబార్ దీవులు
2. అస్సాం
3. బీహార్
4. ఛత్తీస్‌గఢ్
5. గోవా
6. గుజరాత్
7. కేరళ
8. లక్షద్వీప్
9. మధ్యప్రదేశ్
10. మణిపూర్
11. పుదుచ్చేరి
12. పంజాబ్
13. రాజస్థాన్
14. తమిళనాడు
15. ఉత్తరప్రదేశ్
16. ఉత్తరాఖండ్
17. పశ్చిమ బెంగాల్
Also Read
- Jio Recharge: యూజర్లకు జియో షాక్.. రీఛార్జ్ ధరల పెరిగే ఛాన్స్..!
- PM Modi: ఆసియా క్రీడల పతక విజేతలతో ప్రధాని మోడీ భేటీ.. భారత క్రీడాకారుల విజయాలపై ప్రశంసలు!
- EPFO ECR Filing Deadline: వేతన పరిమితి మార్పులతో ECR ఫైలింగ్‌లో మార్పులు.. EPFO కీలక నిర్ణయం
- Nepal: చైనాను కాదని, భారత్‌కే ఓటేసిన నేపాల్ ప్రధాని..
ఈ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితాల సవరణకు సంబంధించిన పూర్తి షెడ్యూల్, దరఖాస్తు విధానం, ఇతర మార్గదర్శకాలను ఎన్నికల సంఘం అధికారిక ప్రకటనల ద్వారా తెలుసుకోవాల్సి ఉంటుంది.
SIR వివాదం మధ్య ఈసీ నిర్ణయం
ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision -SIR)పై దేశవ్యాప్తంగా చర్చలు, నిరసనలు కొనసాగుతున్న సమయంలో ఈసీ తాజా SSR నిర్ణయం తీసుకున్నది. SIR ప్రక్రియలో ఓటర్ల పేర్లు తొలగించడంపై ప్రతిపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగిపోకుండా చూడాలని, ఓటు హక్కు కోల్పోయే పరిస్థితులు రాకూడదని ప్రతిపక్ష నేతలు కోరుతున్నారు. మరోవైపు, ఓటరు జాబితాలను శుద్ధి చేసి మరింత కచ్చితంగా రూపొందించడమే తమ లక్ష్యమని ఎన్నికల సంఘం చెబుతోంది.
వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి
2027లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో ఓటరు జాబితాలు కచ్చితంగా ఉండటం ఎన్నికల నిర్వహణకు కీలకం. ఆయా రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలం 2027లో వేర్వేరు తేదీల్లో ముగియనుంది. అందువల్ల అర్హులైన కొత్త ఓటర్ల నమోదు, ఇప్పటికే ఉన్న వివరాల సవరణ, ఓటరు జాబితాల్లో తప్పుల గుర్తింపు వంటి అంశాలు ప్రాధాన్యం పొందుతున్నాయి.
ఓటర్లు ఏం చేయాలి?
ఓటు హక్కు పొందడానికి అర్హత ఉన్నవారు తమ పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో పరిశీలించుకోవాలి. పేరు లేకపోతే లేదా వ్యక్తిగత వివరాల్లో తప్పులు ఉంటే, ఎన్నికల సంఘం ప్రకటించే అధికారిక షెడ్యూల్, మార్గదర్శకాల ప్రకారం దరఖాస్తు చేసుకోవాలి.
కొత్తగా ఓటు హక్కు పొందే అర్హులైన యువత నమోదు ప్రక్రియను తెలుసుకోవాలి.
ఇప్పటికే నమోదైన ఓటర్లు తమ పేరు, చిరునామా వంటి వివరాలను తనిఖీ చేసుకోవాలి.
పేరు తొలగించినట్లు కనిపిస్తే సంబంధిత ఎన్నికల అధికారులను సంప్రదించి కారణం తెలుసుకోవాలి.
SSR షెడ్యూల్, దరఖాస్తుల గడువుల కోసం భారత ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌ను చూడాలి.
తాజావార్తలు
-
Kawasaki Z300 India Launch: Kawasaki Z300 భారత్‌లోకి.. ధర ఎంత? 296cc ఇంజిన్, ఫీచర్లు, లాంచ్ డేట్ వివరాలు!
-
Nithiin: ‘అలియాస్ రుక్మిణి’తోనైనా నితిన్ లెక్క సరిచేస్తాడా?
-
Special Summary Revision: SIR వివాదం మధ్య ఈసీ కీలక నిర్ణయం.. 17 రాష్ట్రాల్లో ఓటరు జాబితాల సవరణకు ఆదేశాలు!
-
Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
-
Telangana Inter Exam Fee : తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల..
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!