PM Modi: కాంగ్రెస్‌కి అవినీతిలో ‘‘పీహెచ్‌డీ’’ ఉంది.. ప్రధాని మోడీ ఫైర్..
- కాంగ్రెస్ అవినీతిలో పీహెచ్‌డీ చేసింది..
- రాబోయే ఎన్నికల్లో బీజేపీ కూటమిదే విజయం..
- మహారాష్ట్రలో ప్రధాని నరేంద్రమోడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: కాంగ్రెస్, దాని కూటమి మహావికాస్ అఘాడీ(ఎంవీఏ)పై ప్రధాని నరేంద్రమోడీ నిప్పులు చెరిగారు. మంగళవారం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అవినీతిలో కాంగ్రెస్ కూటమికి ‘‘డబుల్ పీహెచ్‌డీ’’ విమర్శించారు. చిమూర్‌లో జరిగిన సభకు హాజరైన మోడీ బీజేపీ మహాయుతి అభ్యర్థుల తరుపున ప్రచారం చేశారు. పనులను అడ్డుకోవడం, జాప్యం చేయడం, దారి మళ్లించడంలో కాంగ్రెస్ వాళ్లకు డబుల్ పీహెచ్‌డీ ఉందని, 2.5 ఏళ్లలో మెట్రో నుంచి వధ్వన్ పోర్టు, సమృద్ధి మహామార్గ్ వరకు ప్రతి అభివృద్ధి ప్రాజెక్టును నిలిపివేశారని అన్నారు. అఘాడీ అంటే అవినీతిలో అతిపెద్ద ఆటగాడు అని గుర్తుంచుకోండని చెప్పారు.
Read Also: China: చైనాలో అమానుష ఘటన.. కార్ ఢీకొట్టి 35 మంది మృతి..
Also Read
- TMC Rebel MPs: 20 మంది TMC రెబల్ ఎంపీలకు షాక్.. అనర్హత పిటిషన్‌పై స్పీకర్ కీలక చర్య
- Fake Cancer Drugs: క్యాన్సర్ బాధితుల ప్రాణాలతో చెలగాటం.. నీళ్లతో నింపిన నకిలీ ఇంజెక్షన్ల విక్రయం గుట్టురట్టు
- India-China Talks: BRICS 2026కు ముందు భారత్-చైనా కీలక భేటీ.. దోవల్, వాంగ్ యీ ఏం మాట్లాడారంటే?
- Sugar Prices Fall: సామాన్యులకు తీపి కబురు.. భారీగా తగ్గిన చక్కెర ధరలు
దేశాన్ని వెనక్కి నెట్టి, బలహీన పరిచేందుకు ఏ అవకాశాన్ని కూడా కాంగ్రెస్, దాని కూటమి వదలడం లేదని దుయ్యబట్టారు. మహారాష్ట్ర భారీ మెజారిటీలో మహాయుతి కూటమి గెలుస్తుందని హాజరైన జనాలే సాక్ష్యమని చెప్పారు. మహాయుతి మహారాష్ట్రలో, కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉంటే డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెప్పారు. గడ్చిరోలితో పాటు దేశవ్యాప్తంగా మావోయిజాన్ని కట్టడి చేశామని అన్నారు.
జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని పునరుద్ధరించడానికి కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయని ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘దశాబ్దాలుగా మన జమ్మూ కాశ్మీర్ వేర్పాటువాదం, ఉగ్రవాదంలో మండిపోతోంది. మాతృభూమిని కాపాడుతూ మహారాష్ట్రకు చెందిన ఎందరో వీర జవాన్లు జమ్మూకశ్మీర్ గడ్డపై వీరమరణం పొందారు. ఇదంతా జరిగిన ఆర్టికల్ 370 ముసుగులో జరిగింది. ఈ ఆర్టికల్ మేము ఆర్టికల్ 370ని రద్దు చేసాము. కాశ్మీర్ భారతదేశం, భారత రాజ్యాంగంతో పూర్తిగా విలీనం చేయబడింది, కశ్మీర్‌లో మళ్లీ ఆర్టికల్ 370ని పాక్ కోరుకున్నట్లే తీసుకురావాలని చూస్తున్నారు’’ అని విమర్శించారు. ఆదివాసీలను వివిధ కులాల వారీగా విభజించి వారిని నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ ‘కుట్ర’ పన్నుతుందని ప్రధాని హెచ్చరించారు.
తాజావార్తలు
-
Konda Murali : కాంగ్రెస్‌ను వీడేది లేదు, వివాదంతో నాకు సంబంధం లేదు.. కొండా మురళి సంచలనం
-
Yash’s Toxic: యశ్‌కి అగ్నిపరీక్ష.. ‘టాక్సిక్’ ముందు ఏకంగా రూ.1000 కోట్ల టార్గెట్!
-
YS Jagan: ‘సీఎంగా ఏం చేస్తున్నా’ అని చంద్రబాబు ప్రశ్నించుకోవాలి.. వైఎస్ జగన్ ఫైర్!
-
Konda Murali: కొండా సురేఖ ఎపిసోడ్‌పై రాయబారం.. భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ..
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!