Site icon NTV Telugu

Donald Trump: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతలపై స్పందించిన డొనాల్డ్ ట్రంప్..

Trump

Trump

Donald Trump: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. పాకిస్తాన్ భారత్‌పై వరసగా రెండో రోజు డ్రోన్ దాడులు చేసింది. సరిహద్దుల్లోని 20 నగరాలను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, వీటన్నింటిన భారత గగనతల రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా అడ్డుకుంది. తాజాగా, ఉద్రిక్తతలపై ట్రంప్ స్పందించినట్లు వైట్‌ హౌజ్ ప్రకటించింది. త్వరగా సమస్య ముగియాలని కోరుకుంటున్నట్లు చెప్పింది.

Read Also: Pak drone attacks: 20 నగరాలను లక్ష్యం చేసుకుని పాకిస్తాన్ తాజా డ్రోన్ దాడులు..

భారత్, పాకిస్తాన్ వివాదంలో అమెరికా మధ్యవర్తిత్వం వహించడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాలపై వైట్ హౌజ్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ మాట్లాడారు. అమెరికా విదేశాంగ కార్యదర్శి, ఎన్ఎస్ఏ మార్కూ రూబియో ఈ వివాదంపై మాట్లాడారని, దీనిని త్వరగా ముగించాలని అధ్యక్షుడు ట్రంప్ కోరుకుంటున్నట్లు చెప్పారు. అంతకుముందు, ట్రంప్ దీనిపై మాట్లాడారు. రెండు దేశాల మధ్య దశాబ్దాలుగా వైరం ఉందని, రెండు దేశాల నాయకులతో తనకు మంచి సంబంధాలు ఉన్నట్లు చెప్పారు. విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో రెండు దేశాలతో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.

Exit mobile version