Hardeep Singh Puri: రాహుల్ గాంధీది “పాకిస్తాన్ జాతిపిత” మనస్తత్వం.. కేంద్రమంత్రి ఫైర్..
- రాహుల్ గాంధీ ‘సిక్కు’ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి ఫైర్..
- అతడిది జిన్నా మనస్తత్వమని విమర్శలు..
- తనకు దక్కకుంటే నాశనం చేసే వ్యక్తి రాహుల్ గాంధీ అంటూ ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hardeep Singh Puri: అమెరికా పర్యటనలో కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. సిక్కులను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై సిక్కు సంఘాలతో పాటు బీజేపీ మండిపడుతోంది. అమెరికాలో ఓ కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ..‘‘సిక్కులు తలపాగా ధరించడానికి అనుమతిస్తారా.. లేదా..? అనే దానిపై భారత్‌లో పోరాటం జరుగుతోంది. సిక్కులు కడాను ధరించి, గురుద్వారాలను సందర్శించడానికి అనుమతిస్తారా..? ఇది సిక్కులకు మాత్రమే కాదు. అన్ని మతాలకు సంబంధించింది’’ అని అన్నారు.
Also Read
- Sakshi Jha: సాక్షి ఝా 'మ్యాన్ హేటర్' వ్యాఖ్యలు.. భర్తకు మద్యం తాగించి చంపాలనుకుంటున్నట్లు చెప్పిన వైనం
- Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
- RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
- Abhijeet Dipke: సోనమ్‌వాంగ్‌చుక్ దీక్ష భగ్నం వేళ అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం..
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పందించారు. అతను భారతదేశంలో సిక్కుల గురించి ఎప్పుడూ మాట్లాడలేదని అన్నారు. ఎవరి ప్రభుత్వ హాయంలో సిక్కుల ఊచకోత జరిగిందో అంతర్మధనం చేసుకోవాలని హితవు పలికారు. కోరుకున్నది దక్కాలి లేకపోతే నాశనం కావాలనే పాకిస్తాన్ జాతి పిత మహ్మద్ అలీ జిన్నా మనస్తత్వం రాహుల్ గాంధీకి ఉందని ఆయన విమర్శించారు. దేశం విచ్ఛిన్నం కావాలని రాహుల్ గాంధీ కోరుకుంటున్నాడని పూరి అన్నారు.
రాహుల్ గాంధీ సిక్కు వర్గంపై చేసిన వ్యాఖ్యలకు స్పందించిన కేంద్రమంతి..తాను 62 ఏళ్లుగా తలపాగా ధరిస్తున్నానని చెప్పారు. అతడు అజ్ఞానంతో చేసిన ప్రకటన అని, ‘‘పప్పు’’ స్టైల్ అని చెప్పడం మరింత కలవరపెట్టే ధోరణి అని తాను భావిస్తున్నట్లు చెప్పారు. అతను ఏం మాట్లాడుతున్నాడో అతడికే తెలియదని చెప్పారు. సిక్కులకు అస్థిత్వ ముప్పు 1984లో ఏర్పడింది చెప్పారు. ఈ ఏడాది సిక్కు వ్యతిరేక అల్లర్లు జరిగాయి. ఈ మారణహోమంలో 3000 మంది చంపబడ్డారు.
తాజావార్తలు
-
Sakshi Jha: సాక్షి ఝా ‘మ్యాన్ హేటర్’ వ్యాఖ్యలు.. భర్తకు మద్యం తాగించి చంపాలనుకుంటున్నట్లు చెప్పిన వైనం
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Fauji: ఇన్‌స్టాగ్రామ్‌ను షేక్ చేసిన ప్రభాస్.. ‘ఫౌజీ’ ఫస్ట్ లుక్‌తో ఆల్‌టైమ్ రికార్డు!
-
Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
-
Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్‌ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్‌తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?