Jharkhand Bird Flu: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. కరోనా కంటే ముందు దేశంలో మరికొన్ని వ్యాధులు ప్రజలను ఇబ్బందిపెట్టిన సందర్భాలున్నాయి. వాటిలో ఒకటి బర్డ్ ఫ్లూ. బర్డ్ ఫ్లూ మూలంగా ప్రజలు ఇబ్బందులు పడటమే కాకుండా కోళ్లతో ఈ వ్యాధి వ్యాపించడంతో కోళ్లఫారాలలోని కోళ్లను బలవంతంగా చంపేయాల్సి వచ్చింది. ఈయితే గత రెండు మూడు సంవత్సరాలుగా బర్డ్ ఫ్లూ కేసులు ఎక్కడా నమోదు కాలేదు. ఇప్పుడు జార్ఖండ్‌లో ఏడాది తరువాత మొదటి బర్డ్ ఫ్లూ కేసు నమోదయింది. దేశంలో మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం మొదలైంది. జార్ఖండ్ రాష్ట్రంలో 9 నెలల చిన్నారికి బర్డ్ ఫ్లూ సోకింది. దగ్గు, జ్వరంతో ఆసుపత్రికి వచ్చిన చిన్నారికి పరీక్షలను నిర్వహించగా బర్డ్ ఫ్లూ అని తేలింది. దీంతో ఆ చిన్నారికి వైద్యులు ప్రత్యేక చికిత్సను అందిస్తున్నారు. జార్ఖండ్ రాష్ట్రం లోని రామ్‌గఢ్ జిల్లాకు చెందిన శిశువు, జ్వరం, దగ్గు మరియు శ్వాసకోశ సమస్యల లక్షణాలతో రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో చేరారు. పాపకు పరీక్షలను నిర్వహించిన వైద్యులు పాపలో బర్డ్ ఫ్లూ ఉన్నట్లు గుర్తించినట్లు సీనియర్ వైద్యుడు శుక్రవారం తెలిపారు.
Read also: Mega Nandamuri: మేము మేము బాగానే ఉంటాం… మీరు కూడా బాగుండాలి
శిశువు జ్వరం, దగ్గు మరియు శ్వాసకోశ సమస్యలతో రిమ్స్‌లో చేరారు. శిశువు యొక్క నాసికా నాబ్‌ను జెనెటిక్స్ మరియు జెనోమిక్స్ విభాగానికి పంపించినట్టు వైద్యులు తెలిపారు. పరీక్షల అనంతరం అది బర్డ్ ఫ్లూగా నిర్ధారించబడిందని పీడియాట్రిక్స్ విభాగానికి చెందిన డాక్టర్ రాజీవ్ మిశ్రా తెలిపారు. ‘‘ఆసుపత్రిలో ఏడాదిలో ఇదే తొలి బర్డ్ ఫ్లూ కేసు అని తెలిపారు. శిశువుకు తానే చికిత్సను అందిస్తున్నట్టు తెలిపారు. తన యూనిట్‌లో చికిత్స పొందుతోందని వైద్యుడు తెలిపారు. కోవిడ్-19 నిబంధనలను పాటిస్తూ.. జాగ్రత్తలు తీసుకున్నామని, శిశువు ఇతరుల నుండి వేరు చేసి ప్రత్యేకంగా చికిత్సను అందిస్తున్నట్టు డాక్టర్ మిశ్రా తెలిపారు.