Tamil Nadu Elections: తమిళనాడులో కుదిరిన డీఎంకే పొత్తు.. కాంగ్రెస్‌కు ఎన్ని స్థానాలంటే.?
- తమిళనాడులో కుదిరిన డీఎంకే పొత్తు..
- 234 సీట్లలో డీఎంకే 164, కాంగ్రెస్ 28 స్థానాల్లో పోటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu Elections: తమిళనాడు ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందనే క్లారిటీ వచ్చింది. ఈరోజు (శనివారం) డీఎంకే కూటమి తన పొత్తుల్ని ఖరారు చేసింది. మొత్తం 234 నియోజకవర్గాల్లో డీఎంకే 164 సీట్లలో పోటీ చేస్తుంటే, మిగిలిన 70 స్థానాలను తన మిత్రపక్షాలకు కేటాయించింది. కూటమిలో ఉన్న కాంగ్రెస్‌కు 28 సీట్లు, డీఎండీకేకు 10 సీట్లు, వీసీకేకు 8 సీట్లు, సీపీఐ, సీపీఎంలకు చెరో 5 స్థానాలు, ఎండీఎంకేకు 4 స్థానాలు కేటాయించింది.
Read Also: Gas Cylinder Robbery: గ్యాస్ సిలిండర్లతో డెలివరీ బాయ్ పరార్..
Also Read
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
- Ravi Shastri: పుతిన్, మోడీ, జిన్‌పింగ్.. బ్రిక్స్‌పై రవిశాస్త్రి సంచలన పోస్ట్..
- ఎవరూ చూడట్లేదు కదా అని Indian Railways లో ఈ పని చేస్తున్నారా? దొరికితే బెయిల్ కూడా దొరకదు!
కొలత్తూరు నుండి డీఎంకే అధినేత, సీఎం స్టాలిన్ తిరిగి పోటీ చేస్తున్నారు.ఆయన కుమారుడు, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ తన సొంత నియోజకవర్గమైన చెపాక్-తిరువల్లికేణి నుంచి బరిలోకి దిగారు. సెంథిల్ బాలాజీ ఈసారి కరూర్ నుంచి కోయంబత్తూర్ సౌత్‌కు మారారు. మంత్రులు కేఎన్ నెహ్రూ తిరుచ్చి వెస్ట్ నుంచి, టీఆర్బీ రాజా మన్నార్గుడి, పెరియసామి దిండిగల్ నుంచి పోటీ చేస్తున్నారు. డీఎంకే 164 మంది అభ్యర్థుల్లో 60 మంది కొత్తవారికి అవకాశం కల్పించారు. 18 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు.
మరోవైపు, ఎన్డీయే కూటమి పొత్తులు కూడా ఇప్పటికే ఖరారయ్యాయి. అన్నాడీఎంకే 169 స్థానాల్లో, బీజేపీ 27 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. భాగస్వామ్యంలో ఉన్న పీఎంకే 18, ఏఎంఎంకే 11 సీట్లలో పోటీకి దిగనున్నాయి. ఏప్రిల్ 23న తమిళనాడు ఎన్నికలు ఒకే విడతలో జరుగుతాయి. మే 04న ఫలితాలు వెల్లడవుతాయి.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!