Site icon NTV Telugu

DK Shivakumar: “కారు” లేని అబ్బాయిలకు అమ్మాయిలను ఇవ్వడం లేదు.. బీజేపీ రెస్పాన్స్ ఇదే..

Dk Shivakumar

Dk Shivakumar

DK Shivakumar: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ప్రస్తుతం కాలంలో ‘‘కార్లు లేని అబ్బాయిలకు అమ్మాయిలను ఇచ్చి పెళ్లి చేయడం లేదు’’ అని అన్నారు. బెంగళూర్‌లో టన్నెల్ రోడ్‌ ప్రాజెక్టును సమర్థిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ నేను ఎవరికీ వాహనాలు తెచ్చుకోవద్దని చెప్పులేను. కుటుంబంతో ప్రయాణం చేసే సమయంలో చాలా మంది తమ సొంత కారులో వెళ్లాలనుకుంటారు. ఇది సామాజిక అలవాటు. ఎంపీలు ప్రజలను కార్లు వదిలి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వాడుకోమని చెప్పవచ్చు. కానీ ఎంత మంది పాటిస్తారు..? నేటి పరిస్థితుల్లో చాలా కుటుంబాలు కారు ఉన్న అబ్బాయిలకే అమ్మాయిలను ఇచ్చే పరిస్థితి ఉంది’’ అని శివకుమార్ అన్నారు.

Read Also: Jaish-e-Mohammed: హిందూ మహిళలను ఎదుర్కొనేందుకు “మహిళ ఉగ్రవాద విభాగం”.. జైషే మహ్మద్ బ్రెయిన్ వాష్..

అయితే, ఈ వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది. ఆ పార్టీ ఎంపీ తేజస్వీ సూర్య డీకే శివకుమార్‌పై వ్యంగ్యంగా మాట్లాడారు. ‘‘నేనను ఇప్పటి వరకు టన్నెల్ రోడ్ ప్రాజెక్ట్ ట్రాఫిక్ సమస్య పరిష్కరించడానికి అనుకున్నాను. కానీ డిప్యూటీ సీఎం గారి ప్రకారం, ఇది కారు లేని అబ్బాయిలకు పెళ్లి కాకపోవడం అనే సామాజిక సమస్య పరిష్కారం. ఎంత అమాయకంగా అనుకున్నానో’’ అని సెటైర్లు పేల్చారు.

Exit mobile version