Ajit Pawar: ఇద్దరికి మించి పిల్లలుంటే, పోటీకి అనర్హులు.. అజిత్ పవార్ షాకింగ్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Disqualify MPs and MLAs who have 3 kids says Ajit Pawar: మన భారతదేశ జనాభా క్రమంగా ఎలా పెరుగుతోందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. నిన్నటి వరకు ప్రపంచంలో జనాభా పరంగా రెండో స్థానంలో ఉన్న మన దేశం.. ఇప్పుడు చైనాను దాటేసి, అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ క్రమంలోనే దేశంలో జనాభా పెరుగుదలపై ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. జనాభా నియంత్రణ క్రమంలో.. ఇద్దరు కన్నా ఎక్కువ పిల్లలున్న వారికి ప్రభుత్వం తరఫున ఎలాంటి రాయితీలు ఇవ్వకూడదని చెప్పారు. అంతేకాదు.. ఇద్దరికి మించి ఎక్కువ సంతానం ఉన్న వారిని ఎంపీ, ఎమ్మెల్యేల ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
SRH vs DC: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్
Also Read
- Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
- Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
బారామతిలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో అజిత్ పవార్ మాట్లాడుతూ.. ‘‘రోజురోజుకీ మన దేశ జనాభా గణనీయంగా పెరిగిపోతోంది. విలాస్‌రావు దేశ్‌ముఖ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. ముగ్గురు పిల్లలున్న ప్రతినిధుల్ని మేము అనర్హులుగా ప్రకటించాం. అప్పట్లో చాలా జాగ్రత్త వహించి, ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే.. ముగ్గురు పిల్లలున్న ఎంపీలు, ఎమ్మెల్యేలను ఎందుకు అనర్హులుగా ప్రకటించలేదని ఆరోజుల్లో కొందరు జనాలు మమ్మల్ని ప్రకటించారు. దీనిపై నేను ఇవ్వదలచుకున్న వివరణ ఒక్కటే.. ఎంపీలు, ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించిన పవర్స్ కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటాయి. కేంద్రం కూడా ఈ మేరకు చర్యలు తీసుకోవాలన్నదే మా డిమాండ్’’ అని చెప్పుకొచ్చారు. మన దేశ జనాభా 142 కోట్లకు పైగా చేరిందని, ఇందుకు మనమే బాధ్యులమని, ఈ అంశాన్ని అందరూ సీరియస్‌గా తీసుకోవాలని అన్నారు.
Operation Kaveri: ఆపరేషన్ కావేరి షురూ.. సుడాన్ పోర్టుకి తరలి వస్తున్న ఇండియన్స్
మన దేశం, రాష్ట్ర, జిల్లా బాగుండాలంటే.. ఒకరిద్దరు పిల్లలకే పరిమితం కావాలని అజిత్ పవార్ పిలుపునిచ్చారు. ఇద్దరికి మించి సంతానం ఉన్న వారికి ఎలాంటి రాయితీలు ఇవ్వకూడదని.. దీంతో ప్రజల్లో జనాభా పెరుగుదల సమస్యపై మరింత అవగాహన పెరుగుతుందని అన్నారు. ఒకవేళ దంపతులకు మొదటి సంతానం తర్వాత రెండోసారి డెలివరీలో కవలలు పుడితే.. అప్పుడు వారి తప్పు లేదన్నారు. కాగా.. ఈ ఏడాది జనవరిలోనూ ఇద్దరు పిల్లల నిబంధనను కఠినంగా అమలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే.. కొడుకు కోసం పట్టుపట్టవద్దని ప్రజల్ని కోరారు.
తాజావార్తలు
-
CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
-
Bajaj Pulsar Festive Offer: Bajaj బైక్‌లపై అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్.. రూ.12,000 వరకు బెనిఫిట్స్, పూర్తి లిస్ట్ ఇదే!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
-
Release Postpones : పెద్ద సినిమాల రిలీజ్ అంటే నమ్మకం లేకుండా పోయిందా?
ట్రెండింగ్
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!