NTV Telugu Site icon

Heavy Snowfall: ఉత్తర భారతదేశాన్ని కమ్మేసిన పొగమంచు.. ఆలస్యంగా నడుస్తున్న 150 విమానాలు

Delhi

Delhi

Heavy Snowfall: దట్టమైన పొగమంచు ఉత్తర భారతదేశాన్ని కమ్మేసింది. దీంతో ఈ రోజు (జనవరి 10) ఉదయం ఢిల్లీలో పొగమంచు ఆవరించడంతో దృశ్యమానతను సున్నాకి పడిపోయింది. దీని ప్రభావంతో సుమారు 150 కంటే ఎక్కువ విమానాలు, దాదాపు 26 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. 41 నిమిషాల విమానాల ఆలస్యంగా నడుస్తున్నట్లు విమానయాన సంస్థ వెబ్‌సైట్లో వెల్లడించింది. అలాగే, నేటి ఉదయం ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ సైతం తెలిపిన వివరాల ప్రకారం.. పొగమంచు కారణంగా విమానాల రాకపోకలపై ప్రభావం పడింది.. కానీ, మరికొన్ని నిమిషాల్లో ఎయిర్ పోర్టు నుంచి తమ ప్రయాణాలు కొనసాగనున్నాయని ప్యాసింజర్లకు భరోసా కల్పించింది.

Read Also: Team India: డబ్బులు తీసుకున్న కుక్కలు మొరుగుతూనే ఉంటాయి.. వైరల్‌గా హర్భజన్‌ పోస్ట్‌!

కాగా, భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పంజాబ్, హర్యానా, రాజస్థాన్‌తో సహా ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాలలో దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలను జారీ చేసింది. ఉత్తర భారత్ లో గత కొన్ని వారాలుగా విపరీతమైన మంచు కురుస్తుండటంతో వందలాది విమానాలు, రైళ్లు రద్దు చేయబడుతున్నాయి. అలాగే, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలిపిన ప్రకారం.. ఢిల్లీలో వాయు నాణ్యత సూచిక (AQI) నేటి ఉదయం 6 గంటలకు 408 వద్ద నమోదైంది. ఇది,’చాలా పేలవమైన’ నుంచి ‘తీవ్రమైన’ కేటగిరీకి చేరుకుంది.

Show comments