దేశ రాజధాని ఢిల్లీలో మాజీ ముఖ్యమంత్రి అతిషి నియోజకవర్గమైన కల్కాజీలో అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేశారు. గోవింద్‌పురి జుగ్గి క్లస్టర్‌లో ఉన్న 1,200కు పైగా అక్రమ గుడిసెలను ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ అధికారులు కూల్చివేశారు. అయితే ప్రభుత్వ తీరుపై ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ధ్వజమెత్తారు. బీజేపీ పేద వ్యతిరేక ప్రభుత్వమని మాజీ సీఎం అతిషి ధ్వజమెత్తింది. అయితే ఢిల్లీ హైకోర్టు సూచనల మేరకే అక్రమ కట్టడాలు కూల్చివేసినట్లు డీడీఏ తెలిపింది.
ఇది కూడా చదవండి: DMK Govt Erasing Hindu: కుల ధృవీకరణ పత్రాల నుంచి ‘హిందూ’ అనే పదాన్ని డీఎంకే సర్కార్ తొలగిస్తుంది..
కల్కాజీ మరియు కల్కాజీ ఎక్స్‌టెన్షన్ మధ్య ఉన్న గోవింద్‌పురి జుగ్గి క్లస్టర్‌లో 1,200కు పైగా గుడిసెలు ఉన్నాయి. ఇక్కడ నివసించేవారిలో ఎక్కువ మంది రోజువారీ కూలీలే ఉన్నారు. వీళ్లంతా చాలా సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో నివసిస్తున్నారని డీడీఏ తెలిపింది. వీళ్లందరికీ ఫ్లాట్‌లు ఇవ్వబడతాయని.. ఇక రేషన్ కార్డులు లేని 1,200 కుటుంబాలు పునరావాసానికి అర్హులు కాదని అధికారులు పేర్కొ్నారు. 3 రోజుల ముందుగానే నోటీసులు ఇచ్చినట్లు తెలిపింది. ఢిల్లీ ఎన్నికలకు ముందు మురికివాడల్లో నివసిస్తున్న పట్టణ పేదలకు కాంక్రీటుతో నిర్మించిన ఇళ్ళు అందిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఇందులో భాగంగానే అర్హులైన పేదలకు ఇళ్లు ఇస్తామని వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Thalliki Vandanam Scheme: “తల్లికి వందనం” స్కీమ్‌కు అర్హులు కావాలంటే ఉండాల్సిన అర్హతలు ఇవే..!
అయితే గుడిసెల తొలగింపుపై మాజీ సీఎం అతిషి ధ్వజమెత్తారు. బీజేపీ పేద వ్యతిరేక ప్రభుత్వమని అభివర్ణించింది. ప్రజలను ఇళ్ల నుంచి బయటకు గెంటేస్తున్నారని.. కర్రలతో కొడుతున్నారని ఆరోపించారు.
అతిషి ఆరోపణలను మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా ఖండించారు. ఆప్ అబద్ధాలను వ్యాప్తి చేస్తోందని.. ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని తిప్పికొట్టారు. అందరికీ పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
