దేశంలో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. ఎక్కడొక చోట అబల దారుణానికి గురవుతూనే ఉంటోంది. ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మృగాళ్లలో మార్పు రావడం లేదు. తాజాగా మహారాష్ట్రలోని పూణెలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పార్శిల్ డెలివరీ చేసేందుకు వచ్చిన వ్యక్తి.. యువతిపై అత్యాచారానికి తెగబడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Konda Murali: ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ తో మంత్రి కొండా సురేఖ, మురళి భేటి.. సంచలన వ్యాఖ్యలు
పూణెలోని షోష్ రెసిడెన్షియల్ సొసైటీలో నివసిస్తున్న మహిళ(22) దగ్గరకు బుధవారం రాత్రి 7:30 గంటలకు కొరియర్ డెలివరీ బాయ్ వచ్చాడు. పార్శిల్ అందజేసిన తర్వాత ఓటీపీ చెప్పమని అడిగాడు. ఇంతలో మొబైల్ తెచ్చేందుకు మహిళ లోపలికి వెళ్లింది. ఆమె లోపలికి వెళ్లగానే డెలివరీ బాయ్ డోర్ క్లోజ్ చేసి.. ఆమెపై పెప్పర్ స్ప్రే చల్లాడు. వెంటనే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. అనంతరం ఆమెపై అత్యాచారం చేసి.. ఆమె ఫోన్లోనే సెల్ఫీ తీసుకుని తిరిగి వస్తానంటూ రాసిపెట్టేసి వెళ్లిపోయాడు.
ఇది కూడా చదవండి: Nithiin : ‘తమ్ముడు’కి దూరంగా నితిన్.. కారణం ఇదే.!
ఇక స్పృహలోకి వచ్చిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. డెలివరీ బాయ్.. తన ముఖంపై చిల్లింగ్ స్ప్రే చల్లి అత్యాచారం చేశాడని.. అనంతరం తన మొబైల్ సెల్ఫీ తీసుకుని మళ్లీ వస్తానంటూ రాసినట్లు చెప్పుకొచ్చింది.
బాధితురాలి స్టేట్మెంట్ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఫోన్కు వచ్చిన ఓటీపీ చెప్పేందుకు లోపలికి వెళ్లగా.. నిందితుడు లోపలికి వెళ్లి స్ప్రే చల్లి అత్యాచారం చేశాడని పోలీసులు తెలిపారు. ఆమె అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు పారిపోయాడని తెలిపారు. కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. అత్యాచారం, మహిళపై దాడి, క్రిమినల్ బెదిరింపులకు సంబంధించి భారతీయ న్యాయ సంహిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు డిప్యూటీ పోలీస్ కమిషనర్ రాజ్ కుమార్ షిండే తెలిపారు.
‘‘నిన్న రాత్రి 7:30 గంటల ప్రాంతంలో బ్యాంక్ కవరుతో ఒక డెలివరీ బాయ్.. 22 ఏళ్ల మహిళ ఫ్లాట్ దగ్గరకు వచ్చాడు. ఓటీపీ చెప్పేందుకు ఆమె లోపలికి వెళ్ళినప్పుడు.. అతడు తలుపు మూసేసి అత్యాచారం చేశాడు. క్రైమ్ బ్రాంచ్ నుంచి ఐదు జోనల్ బృందాలు, పది బృందాలు ఈ కేసుపై పనిచేస్తున్నాయి. రాత్రి 7.30 గంటల నుంచి ఆ మహిళ అపస్మారక స్థితిలో ఉంది. తనిఖీ కోసం ఫోరెన్సిక్ నిపుణులను పిలిపించాం. మహిళ ఫోన్లో ఒక సెల్ఫీ దొరికింది. మేము దానిని కూడా విశ్లేషిస్తున్నాము” అని రాజ్ కుమార్ షిండే చెప్పారు.