NTV Telugu Site icon

Delhi Police: ఢిల్లీలో సీఆర్‌పీఎఫ్‌ స్కూల్‌ వద్ద పేలుడు.. టెలిగ్రామ్ ఛానెల్‌కు పోలీసుల లేఖ

Delhi

Delhi

Delhi Police: ఢిల్లీలోని ప్రశాంత్‌ విహార్‌ ప్రాంతంలోని సీఆర్‌పీఎఫ్‌ స్కూల్‌ దగ్గర ఆదివారం ఉదయం 7.30 గంటల సమయంలో భారీ పేలుడు సంభవించింది. అయితే, ఈ ఘటనకు నాటు బాంబే కారణమని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఈ బాంబ్ పేలుడుపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ), నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్‌(ఎన్‌ఎస్‌జీ), సెంట్రల్‌ రిజర్వు పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్‌)ల టీమ్స్ విచారణ కొనసాగిస్తున్నాయి.

Read Also: Brazil Presiden: బాత్రూంలో జారిపడ్డ బ్రెజిల్ అధ్యక్షుడు.. రష్యా పర్యటనకు దూరం..

అయితే, ఖలిస్థాన్ అనుకూల వేర్పాటు వాదులను భారత ఏజెంట్లు లక్ష్యంగా చేసుకుని.. ప్రతీకారంగా ఈ దాడి జరిగిందని టెలిగ్రామ్‌లో ఓ పోస్ట్ వైరల్ అవుతుంది. ‘జస్టిస్ లీగ్ ఇండియా’ పేరుతో ఓ టెలిగ్రామ్ ఛానెల్‌ ఈ పోస్ట్‌ను పెట్టినట్లు ఢిల్లీ పోలీసులు కనిపెట్టారు. దీంతో ఈ దాడికి ఖలిస్థాన్‌ వేర్పాటువాదులు పాల్పడి ఉంటారని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నారు. అందులో భాగంగానే ఈ ఘటనకు ఖలిస్తాన్‌ వేర్పాటవాదులకు ఉన్న లింక్‌ను పరిశీలిస్తున్నామని చెప్పారు. ఇక, అంశంపై తాజాగా ‘జస్టిస్ లీగ్ ఇండియా’ పేరుతో ఉన్న టెలిగ్రామ్ ఛానెల్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఇవ్వాలని దర్యాప్తు టీమ్ ఆ లేఖలో కోరింది. అయితే, టెలిగ్రామ్ నుంచి విచారణ సంస్థలకు ఇంకా ఎలాంటి స్పందన రాలేదని అధికారులు వెల్లడించారు.