Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Delhi Only Has One Chief Minister Its Arvind Kejriwal Atishi In First Remarks

Atishi: కేజ్రీవాల్‌ని మళ్లీ సీఎం చేయడమే మా లక్ష్యం.. సీఎంగా ఎన్నికైన అతిషీ తొలి కామెంట్స్..

Published Date :September 17, 2024 , 1:46 pm
By Venu Goapl Reddy
  • అరవింద్ కేజ్రీవాల్‌ని మళ్లీ సీఎం చేయడమే మా లక్ష్యం..
  • ఆయన నిజాయితీ గురించి ఢిల్లీ ప్రజలకు తెలుసు..
  • ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ కుట్ర..
  • ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత అతిశీ కామెంట్స్..
Atishi: కేజ్రీవాల్‌ని మళ్లీ సీఎం చేయడమే మా లక్ష్యం.. సీఎంగా ఎన్నికైన అతిషీ తొలి కామెంట్స్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Atishi: ఢిల్లీ లిక్కర్ కేసులో నేపథ్యంలో ఈ రోజు ముఖ్యమంత్రి పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయబోతున్నారు. ఈ రోజు జరిగిన ఆప్ శానససభ పక్ష సమావేశంలో ఢిల్లీకి కొత్త సీఎంగా అతిషీ మార్లేనాని ఆప్ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ముఖ్యమంత్రిగా ఖరారైన తర్వాత తొలిసారిగా అతిషీ స్పందించారు. కేజ్రీవాల్‌ని తన గురువుగా అభివర్ణించారు. తదుపరి ఎన్నికల్లో కేజ్రీవాల్‌ని సీఎం చేయడమే తమ లక్ష్యమని చెప్పారు.

Read Also: Supreme Court: “మహిళా వైద్యుల భద్రత మీ బాధ్యత”.. బెంగాల్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం..

కేజ్రీవాల్‌పై తప్పుడు కేసులు నమోదు చేసి, ఆప్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నించారని బీజేపీపై అతిషీ ఆరోపణలు గుప్పించారు. ‘‘ఢిల్లీకి ఒకే ఒక్క ముఖ్యమంత్రి, అది అరవింద్ కేజ్రీవాల్.. కేజ్రీవాల్‌ను తిరిగి ఢిల్లీ ముఖ్యమంత్రిగా తీసుకురావడమే లక్ష్యంగా రాబోయే కొద్ది నెలల పాటు కృషి చేస్తాను.’’ అని ఆమె అన్నారు. మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి ఒక రాష్ట్రానికి సీఎం కావడం ఆప్‌లోనే సాధ్యమని అన్నారు. ‘‘నేను వేరే పార్టీలో ఉండి ఉంటే, బహుశా నాకు ఎన్నికల టిక్కెట్ కూడా ఇచ్చేది కాదు. కానీ అరవింద్ కేజ్రీవాల్ నన్ను నమ్మి, నన్ను ఎమ్మెల్యే మరియు మంత్రిని చేసి, ఈ రోజు నాకు ముఖ్యమంత్రి బాధ్యతలు ఇచ్చారు’’ అని ఆమె అన్నారు. ప్రస్తుతం ఆర్థిక మంత్రిత్వ శాఖతో పాటు 14 పోర్ట్‌ఫోలియోలను అతిశీ చూస్తున్నారు.

సుప్రీంకోర్టు కేజ్రీవాల్‌కి బెయిల్ ఇవ్వడం కేంద్రానికి చెంపెట్టని ఆమె అన్నారు. కేజ్రీవాల్‌ని తిరిగి సీఎంగా ఢిల్లీ ప్రజలు ఎన్నుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ నిజాయితీ గురించి ప్రజలందరికీ తెలుసని, ఢిల్లీ ప్రజకు అందుతున్న సంక్షేమాన్ని గుర్తించి కేజ్రీవాల్‌ని సీఎం చేస్తారని ఆమె అన్నారు. కేజ్రీవాల్ సీఎం కాకపోతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మొహల్లా క్లినిక్స్, ఉచిత వైద్యం ఉండవని చెప్పారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AAP
  • Arvind Kejriwal
  • Atishi
  • Delhi
  • Delhi liquor case

తాజావార్తలు

  • KrithiShetty : బేబీ ఖాతాలో మరో ప్లాప్.. స్టార్ డైరెక్టర్ యూ టర్న్ తీసుకుంటాడా?

  • Irumudi: రవితేజ ‘ఇరుముడి’లో సీనియర్ హీరోయిన్ ..

  • Jananayagan Leak : జననాయగన్ లీక్.. విజయ్ కు ఎంతో మేలుచేసినట్టే

  • Newly Weds Death: పెళ్లి జరిగిన తెల్లారే విషాదం.. వధూవరులతో సహా నలుగురు మృతి

  • Telangana Inter Results 2026: మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు.. ఈజీగా ఇలా చెక్ చేసుకోండి…

ట్రెండింగ్‌

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions