Delhi Liquor Policy Case: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో గురువారం రాత్రి సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయన కస్టడీ కోరుతూ ఈ రోజు కేజ్రీవాల్‌ని రోస్ ఎవెన్యూ కోర్టు ముందు అధికారులు హాజరుపరిచారు. ఈడీ 10 రోజుల కస్టడీ కోరుతోంది. ఈ మొత్తం స్కామ్‌లో కేజ్రీవాల్ ప్రధాన సూత్రధారుడని కోర్టుకు ఈడీ తెలిపింది. లిక్కర్ పాలసీ 2021-22 ద్వారా హోల్ సేల్ వ్యాపారులకు 12 శాతం, రిటైలర్లకు 185 శాతం హై ప్రాఫిట్ మార్జిన్ అందించిందని ఈడీ పేర్కొంది.
Read Also: IPL 2024: జడేజా కెప్టెన్‌గా ఎందుకు ఫ్లాప్ అయ్యాడు?.. కారణం చెప్పిన కోచ్!
ఈ కేసులో పంజాబ్ ఎన్నికల కోసం ‘సౌత్ గ్రూప్’గా పిలువబడే కొంతమంది నిందితుల నుంచి అరవింద్ కేజ్రీవాల్ రూ. 100 కోట్లు డిమాండ్ చేశారని ఈడీ కోర్టుకు తెలిపింది. ఈ నేరంలో వచ్చే ఆదాయం రూ. 100 కోట్లు లంచం మాత్రమే కాదని, లంచం చెల్లించే వారి ద్వారా వచ్చే లాభాలు రూ. 600 కోట్లకు పైగానే ఉందని దర్యాప్తు సంస్థ కోర్టుకు తెలిపింది. సౌత్ గ్రూప్ నుంచి వచ్చిన రూ. 45 కోట్లను ఆప్ పార్టీ 2021-22లో గోవా ఎన్నికల ప్రచారంలో వినియోగించినట్లు ఈడీ కోర్టుకు వెల్లడించింది.