Dhruv Rathee: రాముడు-సీతలపై వ్యాఖ్యలు.. ధ్రువ్ రాఠీ వీడియో తొలగింపుపై హైకోర్టు డెడ్‌లైన్
- ధ్రువ్ రాఠీ వీడియో తొలగింపు అంశంపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు.
- 15 రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని గ్రీవెన్స్ అప్పిలేట్ కమిటీకి ఆదేశం.
- కోర్టు ఆదేశాలను పాటించకపోతే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరిక.
- వీడియోలో హిందూ దేవతలపై చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhruv Rathee: హిందూ దేవీదేవతలు శ్రీరాముడు-సీతాదేవిపై యూట్యూబర్ ధ్రువ్ రాఠీ చేసిన వీడియోపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శ్రీరాముడు, సీత, శ్రీ కృష్ణుడు మాంసం, మద్యం సేవించారని ధ్రువ్ రాఠీ ఒక వీడియోలో కామెంట్స్ చేశాడు. ఈ వీడియోను యూట్యూబ్ నుంచి తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై 15 రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు శుక్రవారం ప్రభుత్వ గ్రీవెన్స్ అప్పీలేట్ కమిటీ (GAC)ని ఆదేశించింది. కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తే తీవ్రంగా పరిగణిస్తామని స్పష్టం చేసింది.
మార్చి 21 ధ్రువ్ రాఠీ చేసిన ఒక యూట్యూబ్ ఛానెల్లో ‘‘Can Hindus Eat Beef? | Kerala Story 2 Exposed’’ పేరుతో వీడియో అప్లోడ్ చేశాడు. ఈ వీడియోలో హిందూ దేవతలైన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, సీతా దేవి మాసం తిన్నారని, మద్యం సేవించారని ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు మతపరమైన భావాలను దెబ్బతీసేవిగా ఉన్నాయని అభ్యంతరం వ్యక్తమైంది.
Also Read
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
- Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
విచారణ సందర్భంగా, కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) చేతన్ శర్మ, యూట్యూబ్ తగిన జాగ్రత్తలు తీసుకుని, అభ్యంతరకరమైన, విద్వేషాన్ని రెచ్చగొట్టే కంటెంట్‌గా ఆరోపించబడిన దానిని వెంటనే తొలగించి ఉండాల్సిందని వాదించారు. ధ్రువ్ రాఠీ చేసని కంటెంట్ హానికరమైందిగా, విభజనను కలిగించేదిగా కోర్టుకు తెలిపారు. వీడియోను తొలగిస్తామని గూగుల్ కోర్టుకు తెలియజేయాలని, లేదా డివిజన్ బెంచ్ చేసిన పరిశీలనల ఆధారంగా కోర్టు ముందుకు సాగవచ్చని ఆయన వాదించారు.
గూగుల్ తరుఫున హాజరైన న్యాయవాది పిటిషనర్‌కు ఇప్పటికే తమ సమాధానం అందజేశామని, ఈ అంశంపై గ్రీవెన్స్ అప్పిలేట్ కమిటీ ముందు అప్పీల్ కూడా దాఖలు చేసినట్లు కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న తర్వాత జస్టిస్ స్వర్ణ కాంత శర్మ, అప్పీల్ పై 15 రోజుల్లోగా తుది నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వ గ్రీవెన్స్ అప్పిలేట్ కమిటీని ఆదేశించారు. ఈ పిటిషన్‌ను అడ్వకేట్ అమితా సచ్‌దేవా దాఖలు చేశారు. ధ్రువ్ రాఠీ మార్చి 21న అప్లోడ్ చేసిన వీడియోను యూట్యూబ్ నుంచి తొలగించాలని ఆమె కోరారు.
తాజావార్తలు
-
IND Vs WI: బౌలర్లపై విరుచుకుపడిన రోహిత్ శర్మ, గిల్.. సెంచరీలతో వీరవిహారం.. ఒక్క మ్యాచ్‌లో 5 సెంచరీలు..
-
Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
-
Rohit Sharma: రికార్డుల కోట బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. క్రికెట్ హిస్టరీలోనే..
-
Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
-
IND Vs WI: హాఫ్ సెంచరీలతో కదం తొక్కిన రోహిత్, గిల్.. శుభారంభం అందించిన ఓపెనర్స్..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!