EV Push: ఢిల్లీలో సర్కార్ సంచలనం.. 2028 నుంచి పెట్రోల్ బైక్‌లపై కంప్లీట్ బ్యాన్!
- రూ.30 లక్షల లోపు ఈ-కార్లపై నో టాక్స్..
- 32 వేల ఛార్జింగ్ పాయింట్లు..
- రూ.15,000 కోట్ల మెగా ప్లాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
EV Push: దేశ రాజధానిలో శీతాకాలంలో ఉక్కిరిబిక్కిరి చేసే వాయు కాలుష్యానికి చెక్ పెట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం అత్యంత కీలకమైన అడుగు వేసింది. వాహనదారులను ఎలక్ట్రిక్ వాహనాల (EVs) వైపు మళ్లించేందుకు సరికొత్త ‘ఎలక్ట్రిక్ వెహికల్ (EV) పాలసీ’కి సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది. ఈ సరికొత్త పాలసీ ప్రకారం.. రూ.30 లక్షల లోపు ధర ఉన్న ఎలక్ట్రిక్ కార్లకు రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజుల నుంచి పూర్తిగా మినహాయింపు ఇవ్వనున్నారు. సీఎం రేఖా గుప్తా నేతృత్వంలోని కేబినెట్ ఆమోదించిన ఈ పాలసీని తుది ఆమోదం కోసం లెఫ్టినెంట్ గవర్నర్ తరంజిత్ సింగ్ సంధూ వద్దకు పంపనున్నారు. ఎల్జీ క్లియరెన్స్ వచ్చిన తర్వాత జూలై 1 నుంచి ఈ నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఈ పాలసీ మార్చి 31, 2030 వరకు అమల్లో ఉంటుందని సీఎం ప్రకటించారు.
ఏ వాహనానికి ఎంత సబ్సిడీ అంటే..
కేవలం పన్ను మినహాయింపులే కాకుండా వివిధ కేటగిరీల ఈవీ వాహన కొనుగోలుదారులకు ప్రభుత్వం భారీ నగదు సబ్సిడీలను ప్రకటించింది. హైబ్రిడ్ వాహనాలకు ఎలాంటి సబ్సిడీలు ఉండవని, కేవలం జీరో-ఎమిషన్ (పూర్తి ఈవీ) వాహనాలకు మాత్రమే ఇవి వర్తిస్తాయని స్పష్టం చేసింది.
Also Read
- Ketan Agarwal Case: చదువులో జీరో.. ఇంటర్ ఫెయిల్ తర్వాత సియా ఏం చేసిందంటే..!
- CBSE స్టూడెంట్స్‌కు రిలీఫ్.. 10వ క్లాస్‌కు కొత్త రూల్ లేదు.!
- Mahua Moitra: రామమందిర విరాళాల స్కామ్‌పై స్పందించరే.. బీజేపీపై మహువా మొయిత్రా ఫైర్
- Ketan Agarwal Case: కేతన్ పాస్‌పోర్ట్ పోయినప్పుడు జరిగిందిదే.. క్యాబ్ డ్రైవర్ సంచలన వ్యాఖ్యలు
ఎలక్ట్రిక్ టూ-వీలర్స్ (బైక్స్/స్కూటర్స్): కొనుగోలుదారులకు మొదటి ఏడాది రూ.30,000, రెండో ఏడాది రూ.20,000, మూడో ఏడాది రూ.10,000 చొప్పున సబ్సిడీ లభిస్తుంది.
ఎలక్ట్రిక్ త్రీ-వీలర్స్ (ఆటోలు): వీరికి వరుసగా మొదటి మూడేళ్లలో రూ.50,000, రూ.40,000, రూ.30,000 చొప్పున ప్రోత్సాహకాలు అందుతాయి.
ఈ-ట్రక్కులు (N1 కేటగిరీ): లైట్ కమర్షియల్ ఈవీ ట్రక్కుల కొనుగోలుపై గరిష్ఠంగా రూ.1 లక్ష వరకు సబ్సిడీ ఇస్తారు.
స్క్రాపింగ్ బోనస్: పాత BS-IV లేదా అంతకంటే పాత ఫోర్-వీలర్లను స్క్రాప్ చేసి, కొత్త ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేసే వారికి రూ.1 లక్ష స్క్రాపింగ్ ఇన్సెంటివ్ లభిస్తుంది.
పెట్రోల్, సీఎన్జీ బండ్లకు చెక్.. డెడ్‌లైన్స్ ఇవే
కాలుష్యాన్ని పూర్తిగా అదుపు చేయడానికి వీలుగా పెట్రోల్, సీఎన్జీ వాహనాల రిజిస్ట్రేషన్లను దశలవారీగా నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి 1, 2027 నుంచి ఢిల్లీలో కేవలం ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలను మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తారు. పెట్రోల్/సీఎన్జీ ఆటోలు బంద్ కానున్నాయి. ఏప్రిల్ 1, 2028 నుంచి కొత్త పెట్రోల్, సీఎన్జీ టూ-వీలర్ల (బైక్స్/స్కూటర్స్) రిజిస్ట్రేషన్లను పూర్తిగా నిలిపివేస్తారు. ఆ తర్వాత కేవలం ఎలక్ట్రిక్ టూ-వీలర్లకే రిజిస్ట్రేషన్ అనుమతి ఉంటుంది. ఈ సందర్భంగా సీఎం రేఖా గుప్తా మాట్లాడుతూ.. “ఇది ఢిల్లీ చరిత్రలోనే ఒక మైలురాయి. రాబోయే నాలుగేళ్లలో ఈ పాలసీ ద్వారా దాదాపు రూ.15,000 కోట్ల విలువైన ప్రయోజనాలు, పెట్టుబడులు వస్తాయని ఆశిస్తున్నాం. ఇందులో రూ.7,000 కోట్లు నేరుగా ఇన్సెంటివ్స్ (సబ్సిడీల) కోసం, మరో రూ.8,000 కోట్లు ఈవీ మౌలిక సదుపాయాల కల్పనకు, పన్ను రాయితీలకు కేటాయించాం” అని వెల్లడించారు. ఈ విస్తరణకు మద్దతుగా ఢిల్లీ అంతటా 32,000 ఈవీ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందుకోసం ఇప్పటికే భూమిని కూడా సేకరించామని చెప్పారు. లబ్ధిదారులు సబ్సిడీల కోసం దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా ఒక ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్‌ను కూడా త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రభుత్వం చెప్పింది.
తాజావార్తలు
-
EV Push: ఢిల్లీలో సర్కార్ సంచలనం.. 2028 నుంచి పెట్రోల్ బైక్‌లపై కంప్లీట్ బ్యాన్!
-
శాకాహారులుగా మారిపోయాం!.. నభా నటేష్ సెన్సేషనల్ కామెంట్స్!
-
Arrears Release: బకాయిల క్లియరెన్స్.. తెలంగాణ ఉద్యోగులకు ఊరట!
-
Ketan Agarwal Case: చదువులో జీరో.. ఇంటర్ ఫెయిల్ తర్వాత సియా ఏం చేసిందంటే..!
-
Ponguleti Srinivas Reddy : హరీష్‌రావుకు మెంటల్ బ్యాలెన్స్ తప్పింది.. అసెంబ్లీ రద్దు ఎందుకు.?
ట్రెండింగ్
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్‌తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్‌లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్‌గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!