ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి మంగళవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. వాస్తవానికి సోమవారమే నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంది. భారీ ర్యాలీగా వెళ్లడంతో సమయం దాటిపోయింది. దీంతో ఆమె నామినేషన్ వేయకుండా వెనుదిరిగారు. మంగళవారం నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొ్న్నాయి. నామినేషన్ వేసేందుకు ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటల వరకు సమయం ఉంటుంది. కేజ్రీవాల్‌తో కలిసి ఎన్నికల కమిషన్ కార్యాలయానికి వెళ్లారు. కానీ సమయం దాటిపోవడంతో ఓటేయలేకపోయారు. అతిషి కల్కాజీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. అతిషిపై బీజేపీ నుంచి రమేష్ బిధూరి, కాంగ్రెస్ నుంచి అల్కా లాంబా పోటీ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Norway: ఈ దేశం ప్రపంచానికి ఆదర్శం! దాదాపు 90% ఎలక్ట్రిక్ వాహనాలే?
ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు మాత్రం ఫిబ్రవరి 8న విడుదలకానున్నాయి. ఇక్కడ మరోసారి అధికారం కోసం ఆప్ ప్రయత్నిస్తోంది. అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ కూడా తన వంతుగా ప్రయత్నిస్తోంది. ఇలా మూడు పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. బీజేపీ ఇప్పటి వరకు 59 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. కాంగ్రెస్ కొంత పేర్లు వెల్లడించింది.
ఇది కూడా చదవండి: Japan: జపాన్‌లో భూకంపం.. సునామి హెచ్చరికలు జారీ!