చెల్లెలి క్షేమం కోరుకోని అన్న… అన్నయ్య శ్రేయస్సు కాంక్షించని చెల్లెలు ఉండరని చెబుతారు.. తల్లిదండ్రులు ఉన్నా.. గతించినా తల్లి అంశ చెల్లిలో.. తండ్రి అంశ అన్నలో చూసుకుంటారు.. అది రక్తసంబంధం.. యుగాలుగా ఏర్పడింది.. యుగాంతం వరకూ ఉంటుంది.. ఇక, ఇంట్లో ఏ శుభకార్యం అయినా.. చెల్లి ఇంట్లో అన్నదే సందడి.. అన్న ఇంట్లో చెల్లిదే అంతా.. ఇప్పుడు పరిస్థితులు కొంత మారినా.. ఇది మాత్రం కొనసాగుతూనే ఉంది. అయితే, ఓ చెల్లి తన ఇంట్లో ఓ శుభకార్యం తలపెట్టింది.. తన పిల్లలకు చెవులు కుట్టే వేడుక నిర్వహించింది.. కానీ, తన అన్నయ్య అప్పడికే కాలం చేయడంతో.. వినూత్నంగా ఆలోచిచింది.. తన అన్నయ్యను పోలిన విగ్రహాన్ని తయారు చేయించి తన ప్రేమను చాటు కుంది.. ఆ కార్యక్రమాన్ని కూడా వేడుకగా నిర్వహించింది.
Read Also: Holi: మందు బాబులకు బ్యాడ్ న్యూస్
ఇందో.. ఆ చెల్లి కోసం విగ్రహం రూపంలో చనిపోయిన ఆ అన్నయ్య మళ్లీ వచ్చాడు.. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రం దిండిగల్ జిల్లాలో జరిగింది.. చెల్లి ప్రియదర్శని ఇంట్లో శుభకార్యం సందర్భంగా.. చనిపోయిన తన అన్నయ్య పండిదొరై విగ్రహాన్ని తయారు చేయించింది.. ఆ విగ్రహాన్ని బండిలో కూర్చొబెట్టి ఊరేగింపు నిర్వహించారు.. డబ్బు వాయిద్యాలతో.. ఇంట్లో జరిగే వేడకకు తీసుకొచ్చారు.. ఇక, ఆ విగ్రహానికి తమిళ సంస్కృతి తరహాలో పట్టు బట్టలతో అలకరించి.. చిన్నారిని తన అన్నయ్య చేతిలో పెట్టీ చిన్నారికి చెవికుట్టే వేడుకను ఘనంగా నిర్వహించింది ఆ చెల్లి.. విగ్రహం రూపంలో తిరిగి వచ్చిన తన అన్నయ్యతో ఫ్యామిలీ మొత్తం ఫొటోలు దిగారు.. ఈ వేడుకకు వేలాది మంది తరలివచ్చారు.