Congress Working Committee Meeting At Delhi today Evening.
ఇటీవల దేశంలో జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. గత ఎన్నికల్లో పంజాబ్ రాష్ట్రాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్.. ఈ ఎన్నికల్లో ఆ రాష్ట్రాన్ని కూడా చేజార్చుకుంది. ఈ నేపథ్యంలో నేడు ఢిల్లీలో 4 గంటలకు “కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ” సమావేశం నిర్వహించనున్నారు. త్వరలో పార్టీ సంస్థాగత ఎన్నికలు.. పార్టీలో అంతర్గతంగా విస్తరిస్తున్న అసంతృప్తి నెలకొంది. కాంగ్రెస్ పార్టీలో కీలక నిర్ణయాలు తీసుకునే అత్యంత ఉన్నత స్థాయు సంఘం “కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ”(సీడబ్ల్యుసీ) సమావేశంలో సంస్థాగత ఎన్నికల పై నేడు చర్చ జరుగనుంది.
కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పై మరలా విమర్శలు, ప్రశ్నలు మొదలవ్వడంతో, వచ్చే సెప్టెంబరు లో సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని తీసుకున్న నిర్ణయాన్ని సీడబ్ల్యూసీ పునఃసమీక్షించనుంది. సెప్టెంబర్ లో కాకుండా మరింత ముందుగా సంస్థాగత ఎన్నికలు నిర్వహించే అంశంపై సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకోనుంది. కాంగ్రెస్ పార్టీకి పూర్తికాలం (ఫుల్ టైమ్) పనిచేసే అధినేత ఉండాలని, అన్ని స్థాయిల్లో ప్రక్షాళన చేయాలని పార్టీ సీనియర్ అసమ్మతి నేతలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.