Congress: ముగిసిన సీడబ్ల్యూసీ మీటింగ్, కాంగ్రెస్ 7 తీర్మానాలు.. అవి ఏంటంటే..
- ముగిసిన సీడబ్ల్యూసీ సమావేశం..
- 7 తీర్మానాలు చేసిన కాంగ్రెస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: అహ్మదాబాద్ వేదికగా కాంగ్రెస్ కీలక సమావేశం జరుగుతోంది. ఆరు దశాబ్ధాల తర్వతా గుజరాత్లో ఏఐసీసీ అత్యున్న సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు దేశవ్యాప్తంగా ఉన్న 2000 మంది వరకు ప్రముఖ నేతలకు ఆహ్వానం అందింది. మంగళవారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశంలో 7 కీలక తీర్మానాలు చేసింది.
1) రైతుల హక్కుల కోసం పోరాటం చేయడం.
నల్లచట్టాలు, msp పెంపు లాంటి అంశాలపై రైతులకు అండగా సర్దార్ వల్లభాయ్ పటేల్ స్పూర్తి తో పోరాటం. బీజేపీ క్రూరమైన బ్రిటిష్ విధానాలను అవలంబిస్తుందని విమర్శలు. ర
Also Read
2) దేశంలో విద్వేష రాజకీయాలపై పోరాటం చేయాలని నిర్ణయించింది.
బీజేపీ దేశంలో ఐక్యత స్పూర్తిని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తోంది. ప్రాంతీయ విద్వేషాలు, మతాల మధ్య చిచ్చు పెడుతోంది. సర్దార్ పటేల్ బలమైన నాయకత్వం, జవహర్ లాల్ నెహ్రూ దూరదృష్టితో దేశంలో 560కి పైగా సంస్థానాలు విలీనమై ప్రజాస్వామ్య పునాది పడింది. దీనిని బీజేపీ దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది. దేశంలో విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని తీర్మానం చేసింది.
3) కార్మికులు, కర్షకుల హక్కుల కోసం పోరాటం.
4) సామాజిక న్యాయం కోసం పోరాటం.
5) సమాజంలో అసమానతలు, అంతరాలపై తీర్మానం.
బ్రిటీష్ వారు దేశ వనరులు దోచుకున్నారు, ఇప్పుడు బీజేపీ కూడా ఇక్కడి సంపదను దోచుకుంటోంది. క్రోనీ క్యాపిటలిస్టులకు దేశ ఖజానాను ఉపయోగిస్తోంది. ఇది సమాజంలో అసమానతలను, అంతరాలను పెంచుతోంది. దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని తీర్మానం చేశారు.
6) హింసా, మతతత్వానికి వ్యతిరేకంగా తీర్మానం.
సర్దార్ వల్లభబాయ్ పటేల్ ఫిబ్రవరి 4, 1948లో ఆర్ఎస్ఎస్ని నిషేధించారు. తన లేఖలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీని గురించి ప్రస్తావించారు. కానీ నేను హింస, మతతత్వం యొక్క భావజాలం దేశాన్ని అగాధంలోకి నెట్టివేస్తోంది. కాంగ్రెస్ పార్టీ సర్దార్ పటేల్ నిశ్చయతను అనుసరించాలని తీర్మానం చేసింది.
7) గాంధీ-నెహ్రూ-పటేల్ యొక్క విడదీయరాని నాయకత్వం, దీనిపై ప్రస్తుతం దాడి జరుగుతుంది. శత్రుత్వం, విభజన శక్తుల్ని ఎదుర్కోవాలని తీర్మానం.
తాజావార్తలు
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
-
Jr NTR : ‘యమదొంగ’ మ్యాజిక్ రిపీట్.. తారక్ మాస్ ఎంట్రీకి ఫ్యాన్స్ ఫిదా
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!