India-Canada: “కెనడాలోనే ఖలిస్తాన్ ఏర్పాటు చేయండి”.. ట్రూడోకు వ్యతిరేకంగా ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-Canada: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కెనడా, ఇండియాల మధ్య తీవ్ర దౌత్య ఉద్రిక్తతలకు దారి తీసింది. దీనిపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఇండియా ఏజెంట్ల ప్రమేయం ఉందని ఆరోపించాడు. ఇదే కాకుండా కెనడాలోని భారత సీనియర్ దౌత్యవేత్తను బహిష్కరించారు. దీనికి ప్రతిగా భారత్ కూడా కెనడియన్ దౌత్యవేత్తను 5 రోజుల్లో దేశం వదిలి వెళ్లాలని ఆదేశించింది. కెనడా ఆరోపణలు అసంబద్ధమైన, రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలుగా, కెనడా ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిందని ఇండియా ధ్వజమెత్తింది.
ఇదిలా ఉంటే జస్టిన్ ట్రూడోకు వ్యతిరేకంగా యునైటెడ్ హిందూ ఫ్రంట్ ఆదివారం ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపింది. ఖలిస్తాన్ వేర్పాటువాదులకు మద్దతుగా ట్రూడో వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుపట్టారు. ‘‘కెనడాలోనే ఖలిస్తాన్ ఏర్పాటు చేయాలి’’ అని ట్రూడోకు సూచించారు.
Also Read
Read Also: Chandra Arya: హిందూ కెనడియన్లు భయపడుతున్నారు, దాని 3 కారణాలు ఉన్నాయి.. ట్రూడో పార్టీ ఎంపీ..
కెనడా ప్రధాని నిజంగా ఖలిస్తానీలను ప్రేమిస్తే, కెనడాను విభజించి ఖలిస్తాన్ దేశాన్ని ఎందుకు ఏర్పాటు చేయడం లేదు..? అని ప్రశ్నించారు. దాన్ని మొదటగా మేమే గుర్తిస్తామని యునైటెడ్ హిందూ ఫ్రంట్ ప్రెసిడెంట్ భగవాన్ గోయల్ అన్నారు. ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూను ఇండియాకు అప్పగించాలని డిమాండ్ చేశారు.
గురుపత్వంత్ సింగ్ పన్నూ నిషేధిత సిక్ ఫర్ జస్టిస్( ఎస్ఎఫ్‌జే) సంస్థకు చీఫ్ గా ఉన్నాడు. ఇదే కాకుండా ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షా, జై శంకర్, అజిత్ దోవల్‌లపై బెదిరింపుకలు పాల్పడ్డారు. ఇటీవల కెనడియన్ హిందూలు కెనడాను విడిచిపెట్టి భారత్ కి వెళ్లాలని వార్నింగ్ ఇవ్వడం కూడా చర్చనీయాంశం అయింది.
తాజావార్తలు
-
chiranjeevi: చిరంజీవి ఫోన్ కాల్‌తో షాక్ అయ్యా.. ‘పెద్ది’ సక్సెస్‌పై మెగాస్టార్ రియాక్షన్‌ను రివీల్ చేసిన బుచ్చిబాబు!
-
CM Revanth Reddy : మల్కాజ్గిరి నా రాజకీయ పునర్జన్మ..
-
Vaibhav Sooryavanshi: ‘నా ఆట బానే ఉంటుంది కదా.. మరి వాళ్లు అలా ఎందుకు చేశారు’.. భావోద్వేగానికి గురైన సూర్యవంశీ..
-
Varanasi: వారణాసి నుంచి మాంసం దుకాణాలు అవుట్..
-
Peddi Deleted Scenes: రావు రమేష్, జగపతి బాబు సీన్లను ఎడిటింగ్‌లో ఎందుకు లేపేశారో చెప్పిన బుచ్చిబాబు!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!