ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి తరపున సీపీ రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు చేశారు. నాలుగు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, అమిత్ షా, గడ్కరీ హాజరయ్యారు.
నామినేషన్‌కు ముందు రాధాకృష్ణన్ పార్లమెంట్ ఆవరణలో ప్రముఖ వ్యక్తుల విగ్రహాలను సందర్శించి నివాళులర్పించారు. ముందుగా మహాత్మాగాంధీ భారీ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ఇతర విగ్రహాలకు నమస్కరించారు.
ఇది కూడా చదవండి: Rekha Gupta Attacked: రేఖా గుప్తాపై దాడి చేసిన వ్యక్తి ఫొటో విడుదల.. ఏ రాష్ట్ర వ్యక్తి అంటే..!
రాధాకృష్ణన్ తమిళనాడు ప్రాంత వాసి. కోయంబత్తూరు నుంచి రెండు సార్లు లోక్‌సభ ఎంపీగా గెలిచారు. పుదుచ్చేరిలో లెఫ్టినెంట్ గవర్నర్‌గా.. జార్ఖండ్, తెలంగాణలో గవర్నర్‌గా పని చేశారు. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్నారు. అలాగే తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా కూడా పని చేశారు. అనూహ్యంగా రాధాకృష్ణన్‌ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి ఎంపిక చేసింది. ఎన్నికల్లో విజయం సాధిస్తే.. పూర్తి కాలంగా ఉపరాష్ట్రపతిగా కొనసాగుతారు.
ఇది కూడా చదవండి: Drunk Youth Attack Police: తాగుబోతుల వీరంగం.. పోలీసులపై దాడి.. పరారీలో యువకులు!
ఇక మంగళవారం ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో రాధాకృష్ణన్‌ను మోడీ, కేంద్రమంత్రులు సత్కరించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణన్ సేవలను మోడీ ప్రశంసించారు. ఇక రాధాకృష్ణన్ గెలిచేందుకు లోక్‌సభలో.. రాజ్యసభలో సంపూర్ణ మెజార్టీ ఉంది.
ఇక ఇండియా కూటమి అభ్యర్థిగా తెలంగాణ వ్యక్తి, సుప్రీకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్‌రెడ్డి పేరును కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ప్రకటించారు. గురువారం సుదర్శన్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. జగదీప్ ధన్‌ఖర్ అనూహ్యంగా జూలై 21న ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలతో రాజీనామా చేసినట్లు ప్రకటించారు. దీంతో ఉపరాష్ట్రపతి ఎన్నికలు అనివార్యమయ్యాయి.

NDA candidate for Vice President post, C.P. Radhakrishnan files his nomination in the presence of PM Narendra Modi. pic.twitter.com/klsIOdPx3J
— ANI (@ANI) August 20, 2025