Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Covid Variant Xbb1 16 Driving Spike In Cases See Symptoms And Precautions

Covid 19: కరోనా కేసుల పెరుగుదలకు కారణం అవుతున్న XBB1.16 వేరియంట్.. లక్షణాలివే..

Published Date :April 7, 2023 , 10:07 am
By Venu Goapl Reddy
Covid 19: కరోనా కేసుల పెరుగుదలకు కారణం అవుతున్న XBB1.16 వేరియంట్.. లక్షణాలివే..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Covid 19: దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరగుతున్నాయి. కొన్నాళ్ల వరకు కేవలం వెయ్యిలోపే ఉండే రోజూవారీ కేసుల సంఖ్య ప్రస్తుతం 5 వేలను దాటింది. గురువారం ఏకంగా కేసుల సంఖ్య 5,000లను దాటిపోయింది. గతేడాది సెప్టెంబర్ తర్వాత ఇదే అత్యధిక పెరుగుదల. అయితే ప్రస్తుతం కరోనా కేసుల పెరుగుదలకు కరోనా వేరియంట్ ఓమిక్రాన్ XBB1.16 కారణం అవుతోంది. దీని వల్లే దేశంలో కరోనా కేసుల ఆకస్మిక పెరుగుదలకు కారణం అని తెలుస్తోంది. ఢిల్లీలో కరోనా సోకిన రోగుల నుండి సేకరించిన నమూనాలలో 98 శాతం XBB.1.16 వేరియంట్ కేసులే.

ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) కోవిడ్ సబ్ వేరియంట్ XBB.1.16ని నిశితంగా గమనిస్తోంది. ఈ వేరియంట్ పెద్దగా ప్రమాదం కాకున్నా.. కేసుల్లో పెరుగుదలకు కారణం అవుతోంది. దీనిపై కేంద్రం కూడా అప్రమత్తంగా ఉంది. పెరుగుతున్న కేసుల నేపథ్యంలో ఈ రోజు కేంద్రం అత్యున్నత సమావేశాన్ని నిర్వహించబోతోంది.

Read Also: Rs.2000 Currency Note: రూ.2వేల నోటు కనిపించడం లేదు.. ఆర్థిక మంత్రి ఏం చెప్పారంటే

లక్షణాలు ఇవే..

ఈ వేరియంట్ కారణంగా జ్వరం వస్తుంది. ఇది 1-2 రోజుల వరకు కొనసాగుతుంది. గొంతు నొప్పి, బాడీ పెయిన్స్, తలనొప్పి, పొత్తి కడుపులో అసౌకర్యంగా అనిపిస్తుంది. దగ్గు, జలుబు వంటి లక్షణాలను కలిగిస్తుంది. XBB.1.16 వేరియంట్ ఎటువంటి తీవ్రమైన సమస్యలను కలిగించదు. అయినప్పటికీ వృద్ధులు, దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారు, శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందిపడుతున్నవారు దీంతో జాగ్రత్తగా వ్యవహరించాలి.

జాగ్రత్తలు:

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ జారీ చేసిన సర్కులర్ ప్రకారం.. కోవిడ్-19 ఉన్న రోగులు తప్పనిసరిగా హోమ్ ఐసోలేషన్ లో ఉండాలి. భౌతిక దూరం, మాస్క్ వాడాలి, ఎప్పటికప్పుడు రోగులు ఉష్ణోగ్రత, ఆక్సిజన్ సాచురేషన్ లెవల్స్ చెక్ చేసుకోవాలి. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • corona virus
  • Covid 19
  • india
  • Omicron
  • XBB1.16 variant

తాజావార్తలు

  • Mix Veg Raita Recipe: సమ్మర్‌లో కూల్‌గా ఇలా మిక్స్ వెజ్ రైతా రెడీ.. రుచితో పాటు ఆరోగ్యం మీ సొంతం..

  • PM Modi: నారీశక్తి బిల్లుకు అండగా ఉందాం.. దేశ ప్రజలకు మోడీ పిలుపు

  • Gold Rates: హమ్మయ్య.. మగువలకు పండగే పండగ.. దిగొచ్చిన బంగారం ధరలు

  • Bangladesh Cricket: భారత్‌తో దోస్తీకి బంగ్లాదేశ్ క్రికెట్ ముమ్మర ప్రయత్నాలు..

  • Anganwadi Teacher: అమానుష ఘటన.. అంగన్‌వాడీ టీచర్‌ ని చెట్టుకు కట్టేసి కొట్టిన గ్రామస్తులు.. కారణం ఇదే

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions