శార్దుల్‌ మ్యాజిక్‌తో 226 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్‌


సౌత్ ఆఫ్రికాతో జ‌రుగుతున్న రెండో టెస్ట్ లో భార‌త బౌల‌ర్లు అద‌రకొట్టారు. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌లను స్వల్ప స్కోర్లకే పెవిలియన్‌కు పంపుతూ 226 ప‌రుగులకే ఆలౌట్ చేశారు. భారత్ పేస‌ర్ శార్ధుల్ ఠాకూర్ 7 వికెట్లు తీసుకుని సౌత్ ఆఫ్రికాను ఆలౌట్ చేయ‌డంలో కీలక పాత్ర వ‌హించాడు. అలాగే మ‌హమ్మద్‌ ష‌మీ రెండు బుమ్రా ఒక వికెట్లను పడగొట్టారు. కాగా శార్ధుల్ ఠాకూర్ కేవ‌లం 17.5 ఓవర్లలోనే 7 వికెట్లను ప‌డ‌కొట్టి కేరీర్ లోనే ది బెస్ట్ ప్రదర్శనను చూపాడు. భార‌త బౌల‌ర్ల దాటికి ఐదుగురు సౌత్ ఆఫ్రికా బ్యాట్స్ మెన్ లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.

అందులో ఇద్దరూ జీరో ప‌రుగుల‌కే వెనుతిరిగారు. అలాగే మ‌రో ఇద్దరూ 1 ర‌న్ మాత్రమే చేశారు. అయితే కీగ‌న్ పీట‌ర్సన్ (62) తో పాటు సౌత్ ఆఫ్రికా వికెట్ కీప‌ర్ వెర్రేన్నే (51) ప‌రుగులు చేశారు. దీంతో 200 మార్క్‌ను సౌత్ ఆఫ్రికా దాటింది. అయితే టీమిండియా మొద‌టి ఇన్నింగ్స్‌లో 202 పరుగులు మాత్రమే చేసింది. దీంతో సౌతాఫ్రికాకు 24 పరుగుల ఆధిక్యం లభించింది. ప్రస్తుతం టీమిండియా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. కాగా ఇది రెండో రోజు కావ‌డంతో ఈ టెస్టు ఫ‌లితంపై ఆసక్తి నెలకొంది.

Related Articles

Latest Articles