COVID 19: దేశంలో కొత్తగా 16,906 కరోనా కేసులు.. పెరిగిన మరణాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా 15 వేలకు పైగానే నమోదు అవుతున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, బెంగాల్, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో అత్యధికంగా కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా మహమ్మారి పూర్తిగా పోలేదని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. తెలంగాణలో కూడా రోజూ 500 పైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.
తాజాగా దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 16,906 కేసులు నమోదు అయ్యాయి. మరణాల సంఖ్య భారీగా పెరిగింది. 24 గంటల్లో మహమ్మారి బారిన పడి 45 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 1,32,457 యాక్టివ్ కేసులు ఉన్నాయి. పాజిటివిటీ రేటు 4 కన్నా దిగువకు వచ్చింది. పాజిటివిటీ రేటు తగ్గడం ఉపశమనం ఇచ్చే అంశం. ప్రస్తుతం డెయిలీ పాజిటివిటీ రేటు 3.68గా ఉంది. గడిచిన రోజులో 15,447 మంది కరోనా నుంచి రికవరీ అయ్యారు. కరోనా వల్ల ఇప్పటి వరకు దేశంలో 5,25,519 మరణాలు సంభవంచాయి. కరోనా బారిన పడి కోలుకున్నవారి సంఖ్య 4,30,11,874గా ఉంది. ఇప్పటి వరకు అర్హులైన వారికి 1,99,12,79,010 డోసుల వ్యాక్సిన్ ఇచ్చారు. మంగళవారం 11,15,068 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. దేశవ్యాప్తంగా నిన్న ఒక్క రోజు 4,59,302 కరోనా నిర్థారణ పరీక్షలు చేశారు.
Also Read
- Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
- PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
- West Bengal Bypolls: మమతా బెనర్జీకి మరో షాక్.. రేజీనగర్ అభ్యర్థి కూడా బరి నుంచి ఔట్
- Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
Read Also: Earthquake: నెల్లూరులో భూప్రకంపనలు.. పరుగులు తీసిన జనం
ఇదిలా ఉంటే ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు సంఖ్య పెరుగుతోంది. అమెరికాలో వారం రోజుల్లోనే 68 వేల మంది చిన్నారులు కరోనా బారిన పడ్డారు. నిన్న ఒక్క రోజే అమెరికాలో 95,342 మంది కొవిడ్ బారినపడగా.. 254 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 56,28,51,812కు చేరింది. మొత్తం 63,76,619 మంది మరణించారు.
తాజావార్తలు
-
CPM Local Poll Strategy: స్థానిక ఎన్నికల్లో వారితో కలిసి పోటీ..! సీపీఎం కీలక ప్రకటన
-
HMWSSB: తాగునీటిని వృథా చేస్తే ఫైన్.. ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ నంబర్ ఇదే..
-
Golmaal 5 Release Date: అజయ్ దేవగన్ ‘గోల్మాల్ 5’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్షయ్ ఎంట్రీతో ఈసారి నవ్వుల మోతే!
-
Abhishek Porel: నెలకు పైగా జైలు జీవితం.. ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్‌కు బెయిల్!
-
Nadendla Manohar: జనసేన టికెట్లపై క్లారిటీ..! గ్రూపులు లేవు.. పవన్ కల్యాణ్ నిర్ణయమే ఫైనల్..
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!